March 23, 202508:00:28 AM

Kamal Haasan: నా గెటప్ చూస్తే నాకే ఇబ్బందిగా అనిపించింది.. కమల్ కామెంట్స్ వైరల్!

కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  సినిమాలో కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించినా అద్భుతమైన నటనతో కమల్ హాసన్ (Kamal Haasan) మంచి మార్కులు వేయించుకున్నారు. కమల్ కనిపించిన ప్రతి సీన్ గూస్ బంప్స్ వచ్చేలా ఉందని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తను పోషించిన యాస్కీన్ పాత్ర గురించి కమల్ హాసన్ మాట్లాడుతూ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటి నుంచి వరుస ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

కల్కి సినిమా కలెక్షన్లను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని కమల్ కామెంట్లు చేశారు. ఇది చాలా ఆనందకర సమయం అని కమల్ పేర్కొన్నారు. కల్కి సినిమాకు మాత్రం కచ్చితంగా సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఆయన వెల్లడించడం గమనార్హం. కల్కిలో యాస్కీన్ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డామని ఆ గెటప్ చూసిన వెంటనే నాకే ఇబ్బందిగా అనిపించిందని కమల్ పేర్కొన్నారు. అదే సమయంలో చాలా ఉత్సాహంగా అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు.


యాస్కిన్ పాత్ర కోసం చాలా డిజైన్లు చేశారని మేకప్ కోసం లాస్ ఏంజెల్స్ వెళ్లామని కమల్ వెల్లడించారు. కల్కి మూవీ ఆలోచనే ఒక ఆటలాంటిదని కమల్ పేర్కొన్నారు. చిన్నపిల్లల బొమ్మలాటలో తినడానికి ఏమీ లేకపోయినా తిన్నట్టు నటిస్తామని కల్కి సినిమా కూడా అలాంటిదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రేక్షకులను అలా మాయ చేస్తుందని కమల్ వెల్లడించారు. అలా ఆడించిన చిన్నపిల్లాడే నాగీ అని కమల్ తెలిపారు.


ఒకప్పుడు సింగీతం శ్రీనివాసరావు అలా ఉండేవారని ఆయన చెప్పుకొచ్చారు. సీక్వెల్ లో యాస్కీన్ పాత్ర ఎక్కువగా ఉంటుందని కమల్ వెల్లడించారు. నేనెప్పుడూ డబ్బు కోసం సినిమాలు చేయలేదని కమల్ అన్నారు. నేను సినిమాలను, పాత్రలను ఆస్వాదిస్తానని కల్కి చూసి ప్రేక్షకులు సంతోషిస్తే మేము మరింత సంతోషిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. కమల్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.