March 25, 202501:21:26 PM

Mr. Bachchan, Double Ismart: ‘ఇస్మార్ట్..’ కంటే ముందే మిస్టర్ బచ్చన్ రిలీజ్

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar)  దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘రైడ్’ కి ఇది రీమేక్. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు హరీష్ శంకర్ చాలా మార్పులు చేశాడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టారో, ఎప్పుడు ఫినిష్ అయిపోయిందో చాలా మందికి తెలీదు.

అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమా రిలీజ్ కి కూడా రెడీ అయిపోయింది. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఆగస్టులోనే రిలీజ్ కాబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆగస్టు 15న ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) , ‘ఆయ్’ (AAY)  , విక్రమ్ (Vikram) ‘తంగలాన్’ (Thangalaan) సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటు ’35’ (35 Chinna Katha Kaadu)అనే చిన్న సినిమా  కూడా రిలీజ్ కాబోతుంది. ‘మిస్టర్ బచ్చన్’ కూడా అదే డేట్ కి రిలీజ్ ప్లాన్ చేశారు.

కానీ దానికి పెట్టిన బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువ. కాబట్టి.. మొదటి రోజు సోలో రిలీజ్ ఉంటేనే.. రికవరీ పాజిబుల్ అవుతుంది. అందుకోసం ఆగస్టు 14 న ‘మిస్టర్ బచ్చన్’ విడుదల ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అని సమాచారం. ఇప్పటి వరకు ‘మిస్టర్ బచ్చన్’ నుండి ఒక్క పాట మాత్రమే రిలీజ్ అయ్యింది. మరి మిగిలిన పాటలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ప్రమోషన్స్ ఎలా నిర్వహిస్తారో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.