March 31, 202510:55:45 AM

Mr. Bachchan OTT: ‘మిస్టర్ బచ్చన్’ ఓటీటీ రిలీజ్ డేట్.. అది నిజమేనా?

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ‘షాక్’ (Shock)  ‘మిరపకాయ్’ (Mirapakay)  వంటి సినిమాల తర్వాత వస్తున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan). ‘మిరపకాయ్’ హిట్ అవ్వడంతో ‘మిస్టర్ బచ్చన్’ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్ (TG Vishwa Prasad)  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని సడన్ గా ప్రకటించడంతో కొద్దిరోజులుగా చర్చనీయాంశం అయ్యింది.

పైగా షూటింగ్ కూడా ఇంకా పెండింగ్ ఉంది. మరోపక్క ఆగస్టు 15 కి ‘మిస్టర్ బచ్చన్’ తో పాటు రామ్ (Ram)  – పూరి (Puri Jagannadh)..ల ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) కూడా రిలీజ్ కాబోతుంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘మిస్టర్ బచ్చన్’ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ‘నెట్ ఫ్లిక్స్’ సంస్థకి అమ్మారట. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని ఆగస్టు 29 లేదా సెప్టెంబర్ 6 కి స్ట్రీమింగ్ చేస్తామని గట్టిగా చెప్పారట.

లేదు అంటే నిర్మాతలు డిమాండ్ చేసినంత ఇవ్వడం కుదరదని వారు తెగేసి చెప్పారట. దీంతో ఆగస్టు 15 మంచి డేట్ అని భావించి.. దానికి ఫిక్స్ అయ్యారట నిర్మాతలు. ఒకవేళ సినిమాకి హిట్ టాక్ కనుక వస్తే.. 2 వారాల పాటు క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బయ్యర్స్ పెట్టింది వెనక్కి రప్పించడానికి ఆ మాత్రం టైం సరిపోతుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.