March 31, 202511:24:24 AM

Sundeep Kishan: ‘ప్రస్థానం’ లో తన పాత్ర పై సందీప్ కిషన్ షాకింగ్ కామెంట్స్..!

సందీప్ కిషన్ (Sundeep Kishan) .. టాలీవుడ్లో ఉన్న టైర్-3 హీరోల్లో ఒకడు. కానీ ప్రామిసింగ్ సినిమాలు చేస్తాడు అనే నమ్మకం ఇతనిపై ప్రేక్షకుల్లో ఉంది. కంటెంట్ ఉన్న దర్శకుల్ని ఇతను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తూనే ఉన్నాడు. ఆ రకంగా కూడా ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు సందీప్ కిషన్. ‘ప్రస్థానం’ తో ఇతని నట ప్రస్థానం మొదలైంది. ఆ సినిమాకి సాయి కుమార్, శర్వానంద్..లకు (Sharwanand) ఎంత మంచి పేరొచ్చిందో, సందీప్ కిషన్ పాత్రకి కూడా అంతే మంచి పేరు వచ్చింది అని చెప్పాలి.

అయితే ‘ప్రస్థానం’ లో (Prasthanam) తన పాత్ర తనకే నచ్చదని చెప్పి పెద్ద షాకిచ్చాడు సందీప్ కిషన్. ‘రాయన్’ (Raayan) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అతను ఈ కామెంట్స్ చేశాడు. అతను మాట్లాడుతూ..” హీరోగా నేను వైవిధ్యమైన పాత్రలు చేయాలనుకుంటున్నాను. ‘మాస్టర్’ (Master) సినిమాలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పాత్ర అంటే నాకు ఇష్టం. చాలా ఇష్టం. కానీ అలాంటి పాత్ర నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది.

‘చిన్న పిల్లల్ని చంపేస్తాడు’ అతను అంటే నాకు అదోలా ఉంటుంది. ‘ప్రస్థానం’ సినిమాలో కూడా నా పాత్ర నాకు నచ్చదు. అందులో ఓ అమ్మాయిని రేప్ చేసినట్లు, అక్కా బావని కిరాతకంగా కొట్టి చంపేసినట్టు చూపించారు. అది కూడా నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఆ పాత్ర నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ భవిష్యత్తులో అలాంటి పాత్రలు చేయాలని నాకు లేదు” అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.