March 23, 202507:18:33 AM

Mrunal Thakur: వాళ్లు మనతో నిజాయితీగా ఉండటమే రొమాన్స్.. మృణాల్ చెప్పిన విషయాలివే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur),  ఒకరు కాగా ఈ బ్యూటీకి సోషల్ మీడియా వేదికగా క్రేజ్ పెరుగుతోంది. కల్కి 2898 ఏడీ  (Kalki 2898 AD) సినిమాలో మృణాల్ ఠాకూర్ గెస్ట్ రోల్ లో నటించగా తన నటనతో ఆమె ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సీతారామం (Sita Ramam) , హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలతో మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ బ్యూటీ తెలుగులో బిజీ అవుతున్నారు.

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ నా దృష్టిలో రొమాన్స్‌ అనేది చిన్న చిన్న చేష్టలతో ఉంటుందని ఆమె తెలిపారు. మనకు నచ్చిన వాళ్లు మనతో నిజాయితీగా ఉండాలని మన పట్ల శ్రద్ధ చూపించాలని మన కోసం చిన్నచిన్న పనులు చేయాలని మన ఆలోచనలో ఉండటమే రొమాన్స్ అని ఆమె వెల్లడించారు. నా ఉద్దేశంలో వీటి కన్నా రొమాన్స్ మరేదీ ఉండదని మృణాల్ తెలిపారు.

రొమాన్స్ అంటే ఏదో చేయాల్సిన అవసరం లేదని చిన్న టచ్ చాలని ఆమె చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ స్టార్ మినహా మృణాల్ ఠాకూర్ నటించిన సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం మృణాల్ కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ సిద్థాంత్‌ చతుర్వేదితో సినిమా చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మృణాల్ ఠాకూర్ సౌత్ లోని ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడితే అంచనాలను మించి విజయాలను అందుకునే అవకాశాలు అయితే ఉంటాయి. మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉండగా ఆమె కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మృణాల్ ఠాకూర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారని సమాచారం అందుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.