March 23, 202506:53:45 AM

Nag Ashwin: కల్కి2 విషయంలో ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన నాగ్ అశ్విన్.. ఏమైందంటే?

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin)  కాంబినేషన్ లో తెరకెక్కనున్న కల్కి సీక్వెల్ (Kalki 2898 AD) పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కల్కి సినిమా నిన్నటి కలెక్షన్లతో దాదాపుగా మెజారిటీ ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ వీకెండ్ కలెక్షన్లతో ఈ సినిమాకు భారీ స్థాయిలో లాభాలు రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే కల్కి సీక్వెల్ లో నాని (Nani) , నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కనిపించే ఛాన్స్ ఉందని నాగ్ అశ్విన్ వెల్లడించారు.

కల్కి సినిమాలోనే నాని, నవీన్ పొలిశెట్టిని తీసుకోవాలని భావించినా కుదర్లేదని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కల్కి సీక్వెల్ లో వాళ్లను ఏదో ఒకచోట కచ్చితంగా చూపిస్తానని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. కల్కి మూవీ ఫుల్ రన్ లో 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. విజువల్ వండర్ గా తెరకెక్కిన కల్కి సినిమాకు రిపీట్ ఆడియన్స్ ప్లస్ అవుతున్నారు.

రాజమౌళి (S. S. Rajamouli)  తర్వాత ఆ స్థాయి దర్శకుడు నాగ్ అశ్విన్ అనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలిగించే విషయంలో నాగ్ అశ్విన్ పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. నాగ్ అశ్విన్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సత్తా చాటడంతో పాటు అంచెలంచెలుగా మరింత ఎదగాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ప్రభాస్ సినిమాలు కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొడుతున్నాయనే చెప్పాలి.

ఆంధ్ర, సీడెడ్ లో మాత్రం కల్కి సినిమా కలెక్షన్లు కొంతమేర పుంజుకోవాల్సి ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ప్రతి సినిమా ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పిస్తోందనే చెప్పాలి. కల్కి సీక్వెల్ కల్కి సినిమాను మించి హిట్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.