March 23, 202509:29:17 AM

Mahesh Babu , Rajamouli: నాగ్ అశ్విన్ రూట్ లో జక్కన్న.. ప్లాన్ వర్కౌట్ అయితే దబిడి దిబిడే!

కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడంలో ఈ సినిమాలో నటించిన నటీనటుల పాత్ర ఎంతో ఉంది. ప్రభాస్ (Prabhas) , నాగ్ అశ్విన్ (Nag Ashwin) , దీపికా పదుకొనే (Deepika Padukone) , కమల్ హాసన్ (Kamal Haasan) ఒకే సినిమాలో నటించడం అంటే సాధారణమైన విషయం కాదు. మరో 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే కల్కి మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. అన్ని భాషల నటులకు నాగ్ అశ్విన్ ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది.

అయితే రాజమౌళి  (S. S. Rajamouli) సైతం మహేష్ (Mahesh Babu) మూవీ క్యాస్టింగ్ విషయంలో నాగ్ అశ్విన్ ను ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో నటిస్తున్నారని వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో విలన్ గా విక్రమ్ (Vikram) కనిపిస్తారని సమాచారం అందుతోంది. విక్రమ్ గొప్ప నటుడు అయినా సక్సెస్ రేట్ చాలా తక్కువనే సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలో ఛాన్స్ దక్కితే విక్రమ్ నో చెప్పే అవకాశాలు ఉండవు.

జక్కన్న సినిమాలలో హీరోలతో సమానంగా విలన్ రోల్స్ కు ప్రాధాన్యత ఉంటుంది. విలన్ పాత్రను పవర్ ఫుల్ గా చూపించడంలో జక్కన్నకు ఎవరూ సాటిరారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మహేష్ విక్రమ్ ఒకే సినిమాలో నటిస్తే చూడటానికి రెండు కళ్లు చాలవని చెప్పవచ్చు. రాజమౌళి సినిమా అంటే బడ్జెట్ విషయంలో సైతం రూల్స్ ఉండవు. జక్కన్న తన ఊహలను రియాలిటీలోకి తీసుకొనిరావడానికి అస్సలు రాజీ పడరు.

బాహుబలి (Baahubali) సిరీస్, ఆర్.ఆర్.ఆర్ (RRR) సినిమాలతో పాన్ వరల్డ్ స్థాయిలో రాజమౌళి పేరు మారుమ్రోగింది. ఈ దర్శకుడి సినిమాలు బిజినెస్ పరంగా కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి అప్ డేట్స్ వస్తాయేమో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.