March 23, 202507:18:33 AM

Nag Ashwin: క్యాస్ట్ ఫీలింగ్ ఉందని మీరు డిసైడ్ పోయారు.. రిపోర్టర్ కి నాగ్ అశ్విన్ కౌంటర్.!

‘వైజయంతి మూవీస్’ సంస్థ పై అశ్వినీదత్ (C. Aswani Dutt)  ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించారు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) వంటి క్లాసిక్స్ ఈ బ్యానర్ నుండి వచ్చాయి. అయితే తర్వాత ఈ బ్యానర్ నుండి వరుసగా ప్లాప్ సినిమాలు వచ్చాయి. అన్నీ ఎలా ఉన్నా ‘శక్తి’ తో ఈ బ్యానర్ క్లోజ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అశ్వినీదత్ కూతుర్లు అయిన స్వప్న దత్ (Swapna Dutt), ప్రియాంక దత్ (Priyanka Dutt) ..లు తమ టాలెంట్ తో నిలబెట్టారు. నాగ్ అశ్విన్ (Nag Ashwin)  వల్లే అది సాధ్యమైంది అనడంలో సందేహం లేదు.

ఇది పక్కన పెడితే.. ప్రియాంక దత్.. నాగ్ అశ్విన్ భార్య. అంటే అశ్వినీదత్ కి చిన్నల్లుడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఇద్దరు కూతుర్లు కులాంతర వివాహం చేసుకున్నారు. నా కమ్యూనిటీ నుండి అల్లుడు రాలేదు అనేది కొంత లోటుగా ఉన్నట్లు ఆయన డైరెక్ట్ గానే చెప్పుకొచ్చారు. అశ్వినీదత్ గారి మాటలు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నప్పటికీ.. అది ఆయన హానెస్ట్ ఒపీనియన్ అని కూడా అనుకోవచ్చు. కానీ ఆయన ఓ బడా నిర్మాత కాబట్టి, సినిమా వాళ్ళ ప్రభావం జనాలపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వారిని ఇది తప్పుదోవ పట్టించే విధంగా అనిపించొచ్చు.

సరే అది పక్కన పెట్టేస్తే.. నిన్న నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించాడు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ .. ” ‘కల్కి..’  (Kalki 2898 AD)  తో మీరు వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యారు. వైజయంతి బ్యానర్ ని కూడా వరల్డ్ వైడ్ గా ఫేమస్ చేశారు. అయితే అశ్వినీదత్ దత్ గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన కమ్యూనిటీ నుండి అల్లుళ్ళు రాలేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు ‘కల్కి..’ తో సాధించిన సక్సెస్ తో ఆయన ఎలా ఫీలవుతున్నారు.

ఒక చిన్న కొడుకులా నా బ్యానర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు అనే నమ్మకం ఆయనకు వచ్చిందా? అలాగే ప్రియాంక దత్ ని కనుక మీరు పెళ్లి చేసుకోకపోతే.. ఇంత పెద్ద సినిమా తీసే అవకాశం మీకు వచ్చేదా?” అంటూ ప్రశ్నించాడు. దీనికి నాగ్ అశ్విన్ ఇబ్బంది పడుతూనే సమాధానం ఇచ్చాడు. ‘నా జీవితంలో ప్రియాంక దత్ లేకపోతే ‘కల్కి..’ లాంటి పెద్ద సినిమా చేసే అవకాశం ఇంత త్వరగా వచ్చేది కాదు. ఇక అశ్వినీదత్ గారు ‘కల్కి..’ సక్సెస్ తో చాలా ఆనందంగా ఉన్నారు” అంటూ జవాబిచ్చాడు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.