March 22, 202503:58:04 AM

Narne Nithin: నార్నె నితిన్.. మళ్ళీ దానిపైనే ఆధారపడ్డాడా?

ఎన్టీఆర్  (Jr NTR)  బావమరిదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు నార్నె నితిన్ (Narne Nithin) . అతని మొదటి సినిమాగా ‘మ్యాడ్’ (MAD) రిలీజ్ అయ్యింది. అది సూపర్ హిట్ అయ్యింది. కానీ అతని మొదటి సినిమాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజ వారు’ మొదలైంది. ‘శతమానం భవతి’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన సతీష్ వేగేశ్న (Satish Vegesna) ఆ చిత్రానికి దర్శకుడు. షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. కానీ ఎందుకో ఆ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు. ఎప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుందో తెలీదు.

ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘మ్యాడ్’ సినిమాలో నార్నె నితిన్ మెయిన్ హీరో అని చెప్పలేం. అందులో ఓ బ్యాచ్ ఉంటుంది. అందులో నితిన్ ఒకడు. ఎలివేషన్స్ కి ముఖ్యంగా ఫైట్స్ కోసమే అతన్ని వాడుకున్నట్టు ఉంటుంది. తప్ప అతనిలోని యాక్టింగ్ స్కిల్స్ పెద్దగా బయటకు రాలేదు. ‘పోనీ.. ఫస్ట్ సినిమా హిట్ అయ్యింది కదా..! రెండో సినిమా అయినా తనని మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యే విధంగా కొంచెం వెయిట్ ఉన్న సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాడేమో’ అని అంతా అనుకున్నారు.

కానీ అలాంటిదేమీ కాకుండా సెకండ్ మూవీని కూడా అతను కామెడీ జోనర్లోనే చేస్తున్నాడు. అదే ‘ఆయ్’ (AAY) మూవీ. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ (Bunny Vasu)  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజి కె మణిపుత్ర ఈ చిత్రానికి దర్శకుడు. అయితే నితిన్ మొదటి సినిమాలో మాదిరి ఇందులో ఫైట్లు వంటివి చేయడంట నితిన్. పూర్తిగా కామెడీనే కీలక రోల్ ప్లే చేస్తుందని సమాచారం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.