March 20, 202510:46:35 PM

ఇంతమంది రెడీ అవుతున్నారు.. డిసెంబరు వచ్చేసరికి ఎవరు మిగులుతారు? ఎవరొస్తారు?

ఒకప్పుడు టాలీవుడ్‌కి ఏడాదిలో డిసెంబరు డ్రై మంత్‌. ఆ నెలలో సినిమాలు రిలీజ్‌ చేయడం దాదాపు ఉండేవి కావు. ఏవో చిన్న సినిమాలు వచ్చేవి. అయితే నాగార్జున డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నాక ఆఖరి నెలపై అందరూ మక్కువ చూపించడం మొదలుపెట్టారు. గత కొన్నేళ్లుగా డిసెంబరులో ఒకట్రెండు పెద్ద సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. అయితే ఈ ఏడాది ఒకట్రెండు కాదు, చాలా సినిమాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో డిసెం‘బరి’ ధడ ధడే అంటున్నారు.

ఇప్పటివరకు కొన్ని టాలీవుడ్‌ సినిమాలు డిసెంబరు రిలీజ్‌ను అధికారికంగా చెప్పి ఉన్నాయి. కొన్ని ఆ ఆలోచనలో ఉన్నాయి. ఇప్పుడు వీటికి మంచు విష్ణు  (Manchu Vishnu)  ‘కన్నప్ప’ (Kannappa) డిసెంబరులో వస్తుందని చెప్పారు. మరోవైపు రామ్‌చరణ్‌  (Ram Charan) – శంకర్‌ (Shankar)  ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) కూడా అదే నెలలో అని అంటున్నారు. దీంతో ‘డిసెంబరు’ గతంలోలా ఉండదు. ఈసారి అలఘ్‌ అంటూ సినిమాటిక్‌ స్టైల్‌లో ఫ్యాన్స్‌ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకు డిసెంబరు నెలను అడ్వాన్స్‌ బుకింగ్ చేసుకున్న సినిమాలు చూస్తే.. నాగచైతన్య (Naga Chaitanya) – సాయిపల్లవి (Sai Pallavi)  ‘తండేల్‌’ Thandel) , నితిన్ (Nithiin) ‘రాబిన్‌ హుడ్‌’ (Robinhood)ఉన్నాయి.

ఇవి కాకుండా బాలకృష్ణ (Balakrishna) – బాబీ (Bobby)  సినిమా కూడా అదే నెలకు వస్తుంది అంటున్నారు. అలా చూస్తే మొత్తంగా డిసెంబరులో నాలుగు పెద్ద సినిమాలు ఉంటాయి. ఆ లెక్కన వారానికో పెద్ద సినిమా వస్తుంది అని ఓ అంచనాకు వస్తున్నారు. అయితే ఇదంతా (Allu Arjun) – సుకుమార్ (Sukumar) ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule)  విషయం తేల్చడం బట్టి ఉంటుంది అని చెబుతున్నారు. ఆ సినిమా డిసెంబరు తొలి వారంలో వస్తుంది అని ఇప్పటికే చెప్పారు.

అయితే వరుస వాయిదాలు, టూర్ల నేపథ్యంలో సినిమా ఆ రోజుకు పూర్తవ్వడమే కష్టం అని అంటున్నారు. కానీ సినిమా కొత్త షెడ్యూల్‌ త్వరలో మొదలవుతుంది అని టీమ్‌ అంటోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా కూడా రెడీ అయితే డిసెంబరులో ఐదు సినిమాలు ఉంటాయి. ఆ లెక్కన చూసినా డిసెం‘బరి’ ధడ ధడే. మరి ఎవరు ఆఖరి వరకు నిలుస్తారు, ఎవరొస్తారు అనేది చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.