March 23, 202509:45:20 AM

Ninnu Kori Collections: నాని సూపర్ హిట్ మూవీ ‘నిన్ను కోరి’ కి 7 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

నాని (Nani) , నివేదా థామస్ (Nivetha Thomas) కాంబినేషన్లో ‘జెంటిల్మన్’ తర్వాత వచ్చిన చిత్రం ‘నిన్ను కోరి’ (Ninnu Kori) . శివ నిర్వాణ (Shiva Nirvana) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆది పినిశెట్టి (Aadhi Pinisetty )కూడా కీలక పాత్ర పోషించాడు. ‘డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్’ ‘కోన ఫిలిం కార్పొరేషన్’ సంస్థల పై డివివి దానయ్య (D. V. V. Danayya) ఈ చిత్రాన్ని నిర్మించగా…కోన వెంకట్ (Kona Venkat) స్క్రీన్ ప్లే అందించి సహనిర్మాతగా నిలిచారు. 2017 వ సంవత్సరం జూలై 7న రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ నే రాబట్టుకుని.. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది.

25-ninnu-kori

గోపీసుందర్ (Gopi Sundar) సంగీతం, నాని నటన, క్లైమాక్స్ .. ఈ సినిమా సక్సెస్ లో మేజర్ రోల్ పోషించాయి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 7 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :

నైజాం 9.55 cr
సీడెడ్ 2.75 cr
ఉత్తరాంధ్ర 3.25 cr
ఈస్ట్ 1.80 cr
వెస్ట్ 1.15 cr
కృష్ణా 1.55 cr
గుంటూరు 1.50 cr
నెల్లూరు 0.65 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 22.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.90 cr
 ఓవర్సీస్ 3.46 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  28.56 cr (షేర్)

‘నిన్ను కోరి’ రూ.22.37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద రూ.28.56 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు ఈ సినిమా రూ.6.19 కోట్ల లాభాలు అందించింది. పోటీగా ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ ఉన్నా ఈ సినిమా స్ట్రాంగ్ గా నిలబడింది అని చెప్పాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.