March 21, 202505:29:33 AM

Prabhas Mother Siva Kumari: సినిమాల విషయంలో ప్రభాస్ తల్లి అంచనా తప్పదట.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas) కెరీర్ పరంగా టాప్ లో ఉండగా కల్కి 2898 ఏడీ  (Kalki 2898 AD)  మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రదర్శితం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించడం గమనార్హం. అయితే ప్రభాస్ గురించి దాదాపుగా అన్ని విషయాలు తెలిసినా ప్రభాస్ కుటుంబ సభ్యుల గురించి మాత్రం అభిమానులకు ఎక్కువగా తెలియదు. ప్రభాస్ తల్లి పేరు శివ కుమారి కాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ తల్లి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఆ విషయాలు విన్న నెటిజన్లు ప్రభాస్ తల్లి టాలెంట్ గురించి తెలిసి ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రభాస్ సినిమా రిలీజైన వెంటనే శివకుమారి ఆ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా చూస్తారట. సినిమా చూసి ఆ సినిమా ఫలితాన్ని శివకుమారి కచ్చితంగా అంచనా వేస్తారట. సినిమాకు సంబంధించి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో ఏం చేసి ఉంటే సినిమా ఫలితం మారేదో చెప్పే ప్రతిభ కూడా ఆమెకు ఉందని శ్యామలాదేవి చెప్పిన విషయాల ద్వారా అర్థమవుతోంది.

ఒక సినిమా ఫలితాన్ని ఇంత పర్ఫెక్ట్ గా అంచనా వేయడం అందరికీ సాధ్యం కాదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మరోవైపు కల్కి 2898 ఏడీ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను మించి హిట్ గా నిలిచింది. పెంచిన టికెట్ రేట్లు ఈ సినిమాకు కలెక్షన్ల పరంగా ప్లస్ అయ్యాయి.

ఈ సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కల్కి 2898 ఏడీ కలిగిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి సినిమాపై చాలా ఆశలు పెట్టుకోగా ఆ ఆశలను ఈ సినిమా నెరవేర్చింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.