Varalaxmi Sarathkumar Marriage Photos: ఘనంగా వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

ఈ ఏడాది చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), మీరా చోప్రా (Meera Chopra).. వారితో పాటు దిల్ రాజు (Dil Raju)  సోదరుడి కొడుకు ఆశిష్ (Ashish Reddy).. వంటి వారు ఉన్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. నటి వరలక్ష్మీ శరత్ కుమార్  (Varalaxmi Sarathkumar)పెళ్లి చేసుకున్నారు… ముంబైకి చెందిన ఆర్ట్‌ గ్యాలరీ నిర్వాహకుడు నికోలై సచ్‌దేవ్‌ తో నిశ్చయమైన సంగతి తెలిసిందే.

మార్చి 1న వీరి ఎంగేజ్మెంట్ ముంబైలోని ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.14 ఏళ్లుగా ఉన్న వీరి పరిచయం కాస్త స్నేహంగా, ఫ్రెండ్షిప్ గా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్ళికి రెడీ అయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె వెడ్డింగ్ కార్డ్స్ ని అల్లు అర్జున్ (Allu Arjun) , బాలకృష్ణ (Balakrishna) , అల్లు అరవింద్ (Allu Aravidh)  వంటి టాలీవుడ్ స్టార్స్ కి ఇచ్చి ఆహ్వానించిన ఫోటోలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత చెన్నైలో జూలై 3న ఆమె వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక నిన్న నికోలై సచ్‌దేవ్‌ తో వరలక్ష్మీ వివాహం.. బ్యాంకాక్ లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు వీరి పెళ్లి వేడుకకు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు.వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.