March 25, 202510:14:33 AM

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ది రాజాసాబ్ గ్లింప్స్ అప్పుడేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas)   కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. కల్కి 2898 ఏడీ హవా మరో రెండు నుంచి మూడు వారాల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. నిర్మాతలకు ఈ మధ్య కాలంలో అదిరిపోయే లాభాలను అందించిన సినిమాలలో కల్కి 2898 ఏడీ సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

కల్కి సినిమా వల్ల ఇంతకాలం ది రాజాసాబ్ (The Raja saab)  మూవీ ప్రమోషన్స్ మొదలుకాలేదు. అయితే కల్కి 2898 ఏడీ రిలీజ్ కావడం మరో 10, 15 రోజుల్లో ఈ సినిమా ఫుల్ రన్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దిరాజాసాబ్ మూవీ గ్లింప్స్ దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. ది రాజాసాబ్ మూవీ మూవీ గ్లింప్స్ ఈ నెలలో విడుదల కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

వైరల్ అవుతున్న వార్త నిజమైతే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. వరుస విజయాలు ఇప్పటికే ప్రభాస్ మార్కెట్ ను పెంచేశాయి. పరిమిత బడ్జెట్ తో ప్రభాస్ తో సినిమా తెరకెక్కిస్తే భారీ లాభాలు ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ఆరు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊపిరి పోస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ కెరీర్ పరంగా వరుస విజయాలు సాధించి సక్సెస్ రేట్ ను పెంచుకోవాలని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ది రాజాసాబ్ మూవీ కూడా సక్సెస్ సాధిస్తే ప్రభాస్ ఖాతాలో హ్యాట్రిక్ చేరుతుంది. ప్రభాస్ తో సినిమాలు తీసిన నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.