March 20, 202511:23:56 AM

Raasi: కల్కి సినిమాకు రివ్యూ ఇచ్చిన రాశి.. వాళ్లకు నచ్చుతుందంటూ?

ప్రభాస్ (Prabhas)  నాగ్ అశ్విన్ (Nag Ashwin)  కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ  (Kalki 2898 AD)  సినిమా అంచనాలను మించి విజయం సాధించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్ రాశి (Raasi) తాజాగా కల్కి 2898 ఏడీ సినిమాను వీక్షించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కల్కి సినిమా అద్భుతంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. కల్కి మూవీ చూస్తున్నంత సేపు చాలా థ్రిల్లింగ్ గా అనిపించిందని ఆమె కామెంట్లు చేశారు. నేను నా కూతురుతో కలిసి కల్కి సినిమాను చూశానని ఆమె అన్నారు.

కల్కి సినిమాను త్రీడీలో చూశామని ఫుల్ గా ఎంజాయ్ చేశామని వెల్లడించారు. ఈ సినిమాను చిన్నపిల్లలు సైతం ఎక్కువగా ఇష్టపడతారని రాశి చెప్పుకొచ్చారు. సీనియర్ హీరోయిన్ రాశి ఈ మధ్య కాలంలో కొన్ని సీరియళ్లలో నటించిన సంగతి తెలిసిందే. కల్కి 2898 ఏడీ ఫ్యాన్స్ రాశి చేసిన కామెంట్ల విషయంలో ఎంతో సంతోషిస్తున్నారు. కల్కి 2898 ఏడీ కలెక్షన్ల విషయంలో సత్తా చాటుతోంది.

ఆగష్టు నెల 15వ వరకు భారీ సినిమాలేవీ లేకపోవడంతో అప్పటివరకు ఈ సినిమాల హవా కొనసాగే అవకాశం ఉంది. కల్కి1 ఈ రేంజ్ లో ఉంటే కల్కి2 ఏ రేంజ్ లో ఉంటుందో అనే చర్చ సైతం ప్రేక్షకుల మధ్య జరుగుతుండటం కొసమెరుపు. కల్కి2 సినిమాకు బడ్జెట్ పరంగా కూడా లిమిట్స్ లేవని బిజినెస్ పరంగా కూడా అదరగొట్టడం ఖాయమని తెలుస్తోంది.

ప్రభాస్ వరుస సక్సెస్ లతో సంతోషంగా ఉండగా ప్రభాస్ కొత్త సినిమాలకు సంబంధించిన కొన్ని అప్ డేట్స్ సైతం వైరల్ అవుతున్నాయి. ఆ అప్ డేట్స్ లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. 2024 బిగ్గెస్ట్ హిట్ కల్కి 2898 ఏడీ అని ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే మరో మూడు పాన్ ఇండియా సినిమాలు ఈ ఏడాదికే ఫిక్స్ అయిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.