March 23, 202508:00:19 AM

Ravi Teja, Bobby: రవితేజతో మరోసారి సినిమా చేయడానికి రెడీ అవుతున్న హిట్‌ డైరక్టర్‌!

రచయితగా ఎన్నో హిట్‌ చిత్రాలు ఇచ్చిన కేఎస్‌ రవీంద్ర (బాబీ) (Bobby ) దర్శకుడిగా తొలి సినిమా చేసింది రవితేజతోనే (Ravi Teja). మాస్‌ మహరాజ్‌కి ఎలాంటి కథ పడితే అదిరిపోతుంది అనే విషయంలో ఫుల్‌ క్లారిటీతో ‘పవర్‌’ (Power) ఫుల్‌ కథ రాసి, డైరెక్ట్‌ చేసి హిట్‌ కొట్టారు బాబీ. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేస్తారు అని సమాచారం. మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన బాబీ మరోసారి అలాంటి కథ రాశారట.

చిరంజీవితో (Chiranjeevi) ‘వాల్తేరు వీర‌య్య‌’ (Waltair Veerayya) లాంటి సినిమా చేసి కెరీర్‌ హయ్యెస్ట్‌ గ్రాసర్‌ అందించిన బాబీ.. ఇప్పుడు బాలకృష్ణతో (Nandamuri Balakrishna)సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది ఆఖరులో వస్తుంది అంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలు అన్నీ అదిరిపోయాయి. ఈ సినిమాతో ‘వీర మాస్’ హిట్‌ కొడదామని చూస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఆఖరులో రిలీజ్‌ చేస్తారని టాక్‌.

దీంతో బాబీ తర్వాతి సినిమా ఏంటి? అనే చర్చ మొదలైంది. దీనికి సమాధానం తన తొలి హీరో రవితేజ సినిమానే అని చెబుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్‌ మీద ఈ సినిమా ఉంటుందట. మాస్‌ మహారాజా ఎందుకో కానీ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీలో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ‘ధ‌మాకా’తో (Dhamaka) మొదలైన ఈ కాంబో.. ఇప్పుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar)  ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌’తో (Mr. Bachchan) కంటిన్యూ అవుతోంది. ఇక బాబీ – పీపుల్ మీడియా ‘వెంకీ మామ’ (Venky Mama) చేశారు.

అలా తెలిసిన, గతంలో చేసిన కాంబోలు రెండూ కలసి కొత్త సినిమా చేస్తున్నారన్నమాట. అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలాంటి కథ రాసుకున్నారు లాంటి వివరాలు ఏవీ లేవు. ‘మిస్టర్‌ బచ్చన్‌’ రిలీజ్‌ తర్వాత ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. ఆ లెక్కన వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవ్వొచ్చు. అప్పుడు మనకు మరిన్ని వివరాలు తెలుస్తాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.