March 19, 202511:24:06 AM

Sharwanand: తేజు కోసం వెయిట్ చేయలేక శర్వానంద్ వద్దకి వెళ్ళిపోయాడా?

సంపత్ నంది (Sampath Nandi) టాలీవుడ్లో ఉన్న అండర్ రేటెడ్ స్టార్ డైరెక్టర్. ‘ఏమైంది ఈవేళ’ ‘రచ్చ’ (Racha) ‘బెంగాల్ టైగర్’ (Bengal Tiger) ‘సీటీమార్’ (Seetimaarr) వంటి హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. మాస్ సినిమా తీయడంలో సంపత్ నంది స్పెషలిస్ట్. అందుకే నిర్మాతలు కూడా ఇతన్ని బాగా నమ్ముతారు. అయితే ప్రస్తుతం స్టార్ హీరోలు ఖాళీగా లేరు. దీంతో మిడ్ రేంజ్ హీరో అయిన సాయి ధరమ్ తేజ్ తో (Sai Dharam Tej) ఓ సినిమా సెట్ చేసుకున్నాడు. అదే ‘గంజా శంకర్’ అనే సినిమా సెట్ చేసుకున్నాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ఓ చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. బడ్జెట్ సమస్యలే ఇందుకు కారణం అని తేలింది. సాయి ధరమ్ తేజ్ మార్కెట్ కి రెండింతలు ఈ సినిమాకి పెట్టాల్సి ఉందట. అది రిస్క్ అనిపించి నిర్మాత వెనక్కి తగ్గినట్టు స్పష్టమవుతుంది. సాయి ధరమ్ తేజ్ కూడా ‘హనుమాన్’ (Hanu Man) నిర్మాతతో వేరే సినిమా సెట్ చేసుకున్నాడు.

ఈ క్రమంలో సంపత్ నంది.. శర్వానంద్ తో (Sharwanand) తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అయితే ‘గంజా శంకర్’ కథనే శర్వానంద్ తో చేస్తున్నట్లు టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. శర్వానంద్ తో సంపత్ నంది చేయబోతున్న కథ ‘గంజా శంకర్’ కాదట. వేరే కథతో శర్వానంద్- సంపత్..ల మూవీ ఉంటుందట.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.