March 27, 202510:22:19 PM

Siddharth: లేడీ రిపోర్టర్ ని కించపరిచి.. ‘భారతీయుడు2’ ప్రమోషన్స్ లో సిద్దార్థ్ అత్యుత్సాహం

కమల్ హాసన్ (Kamal Haasan) – శంకర్ (Shankar)  కాంబినేషన్లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’  (Bharateeyudu 2)  చిత్రం ఈ శుక్రవారం అంటే జూలై 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1996 లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇది సీక్వెల్. ‘లైకా ప్రొడక్షన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), కాజల్ వంటి భామలు ఈ చిత్రంలో నటించారు. అలాగే సిద్దార్థ్  (Siddharth) , బాబీ సింహా (Bobby Simha) వంటి స్టార్లు కూడా నటించారు.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో తెలుగులో కూడా ప్రమోషన్స్ ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో కమల్ హాసన్, దర్శకుడు శంకర్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా పాల్గొన్నారు. ఇందులో భాగంగా మీడియా ‘భారతీయుడు 2’ మీదకు తమ ప్రశ్నల్ని బాణాలుగా వదలడం జరిగింది.

అయితే కమల్ హాసన్,శంకర్ వంటి స్టార్స్ ను పక్కన పెట్టుకుని సిద్దార్థ్, రకుల్, బాబీ సింహా వంటి వారి మీదకి ఎవరి ఫోకస్ వెళ్ళదు కదా. ఈరోజు అదే జరిగింది. రిపోర్టర్లు అందరూ కమల్, శంకర్లనే ప్రశ్నలు అడిగారు. రకుల్, బాబీ సింహా సైలెంట్ గా చూస్తూ ఉన్నారు. అయితే సిద్దార్థ్ మాత్రం తనని పట్టించుకోవడం లేదు అనుకున్నాడో ఏమో కానీ అత్యుత్సాహం ప్రదర్శించాడు.

పరోక్షంగా మీడియా పై సెటైర్లు వేశాడు. చివర్లో ఒక లేడీ రిపోర్టర్ కి మైక్ ఇవ్వాలని కోరాడు. లేడీ కాబట్టి… సిద్దార్థ్ లవర్ బాయ్ ఇమేజ్ ను గుర్తించి ప్రశ్న అడుగుతుందిలే అని అతను ఆశపడినట్టు ఉన్నాడు. కానీ ఆ లేడీ రిపోర్టర్ కూడా కమల్ హాసన్ నే ప్రశ్నించడం జరిగింది. దీంతో సిద్దార్థ్ కి కోపం వచ్చి ఆ లేడీ రిపోర్టర్ ప్రశ్న వేసే టైంలో ఆటంకపరిచాడు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.