March 23, 202507:43:41 AM

Surender Reddy: క్రేజీ ప్రాజెక్ట్ లేనట్టేనా.. అయినా ఆ స్టార్ హీరోకి మంచి ఛాన్సే..!

‘ఏజెంట్’ (Agent) తర్వాత సురేందర్ రెడ్డి (Surender Reddy) హవా తగ్గిపోయింది అనే కామెంట్స్ గట్టిగా వినిపించాయి. కానీ అది అపోహ మాత్రమే. ‘ఏజెంట్’ ఆడకపోయినా సురేందర్ రెడ్డికి పెద్ద బ్యానర్లో సినిమాలు చేసే ఛాన్సులు లభించాయి. పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) ఓ సినిమా అనుకున్నారు. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు నడుస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్  ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీ.

కాబట్టి.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్సులు తక్కువ. లేదు అంటే వేరే హీరోతో చేసే ఛాన్స్ ఉంటుంది. మరోపక్క వెంకటేష్ తో (Venkatesh) సినిమా అనుకున్నాడు సురేందర్ రెడ్డి. కానీ స్క్రిప్ట్ విషయంలో వెంకటేష్ సంతృప్తిగా లేకపోవడం వల్ల అది కూడా సెట్ అయ్యే ఛాన్సులు కనిపించడం లేదు. మధ్యలోనే విక్రమ్ తో (Vikram)  తెలుగు, తమిళ భాషల్లో ఓ బై లింగ్యువల్ మూవీ చేయాలనుకున్నాడు సురేందర్ రెడ్డి. అప్పుడు చాలా కాలం తర్వాత తెలుగులో విక్రమ్ చేసే సినిమా ఇదే అయ్యుండేది.

కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు కూడా సెట్ అవ్వలేదు. విక్రమ్ కి తెలుగులో స్ట్రైట్ మూవీ చేయాలనే ఆశ ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. పైగా అతనికి తెలుగులో ఇమేజ్ ఉంది. ఇలాంటి టైంలో అతను రాజమౌళితో సినిమా ఓకే చేసినట్లు తెలుస్తుంది. మహేష్ (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli)  ప్రాజెక్టులో విక్రమ్ ఆల్మోస్ట్ ఫిక్స్ అని స్పష్టమవుతుంది. ఈ రకంగా సురేందర్ రెడ్డితో సినిమా సెట్ అవుతుంది అనుకుంటే రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు విక్రమ్.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.