March 17, 202507:50:48 AM

Venkatesh, Balakrishna: వెంకటేష్ 76.. నుండీ గూజ్ బంప్స్ తెప్పించే న్యూస్..!

విక్టరీ వెంకటేష్  (Venkatesh) ఈ ఏడాది ‘సైందవ్’ తో (Saindhav)  ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శైలేష్ కొలను (Sailesh Kolanu)  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అనుకున్న ఫలితాన్ని సాధించలేదు. వెంకటేష్ 75వ సినిమా. అంటే మైల్ స్టోన్ మూవీ. వేరే టైంలో రిలీజ్ అయ్యి ఉంటే.. ఈ సినిమా ఫలితం మరోలా ఉండేదేమో.. కానీ సంక్రాంతికి కరెక్ట్ రిలీజ్ కాదు అనే వాదనలు వినిపించాయి. దీంతో వెంకీ కచ్చితంగా ఓ హిట్టు కొట్టాలని భావించి వెంటనే అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గతంలో ‘ఎఫ్ 2’ (F2 Movie) ‘ఎఫ్ 3’ (F3 Movie)  వంటి హిట్ సినిమాలు ఈ కాంబినేషన్లో వచ్చాయి. దీంతో వీరి నెక్స్ట్ మూవీ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. వెంకటేష్ – అనిల్ రావిపూడిల.. 3వ సినిమాలో మరో హీరోకి కూడా స్పేస్ ఉందట. దాదాపు 30 నిమిషాలు నిడివి కలిగిన పాత్ర ఇది. దీని కోసం అనిల్ రావిపూడి బాలకృష్ణని (Balakrishna) సంపాదించడం జరిగిందట. ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) అనే సినిమా ఈ కాంబినేషన్లో రూపొంది బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఆ చనువుతో బాలయ్యని అప్రోచ్ అయ్యాడు అనిల్. కానీ బాలయ్య ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ వర్కౌట్ అయితే వెంకటేష్- బాలయ్యని ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం లభిస్తుంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) వెంకటేష్ కి భార్య పాత్రలో కనిపించబోతుంది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించబోతుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.