March 22, 202503:48:13 AM

Akshay Kumar: స్టార్ హీరో సింప్లిసిటీ… నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించి…

హీరోలు అందరూ ఒకలా ఉండరు.. కొందరు ఎవరైనా దగ్గరికొస్తే కొడతారు, మరికొంతమంది తోసేస్తారు. ఇంకొంతమంది ఉన్నది ఎక్కడ అనేది కూడా తమ చేతలతో చూడకుండా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఒకరు. ఇటీవల ఆయన నడి రోడ్డు మీద చేసిన ఓ పని ఇటు అభిమానులు, అటు ట్రోలర్స్‌ మనసులు గెలుచుకుంది. ఇంతకీ ఏమైందంటే.. అక్షయ్ కుమార్ (Akshay Kumar) .. ఈ మధ్య సినిమాల విషయాలతో కాకుండా ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.

Akshay Kumar

అవేంటో తర్వాత చూద్దాం. తాజాగా ఆయన చేసిన మరో పని అభిమానుల మనసులు గెలుచుకుంది. అక్షయ్ కుమార్ ఎక్కడికో వెళుతుండగా ఓ వీడియోగ్రాఫర్ తన కెమెరాలో విజువల్స్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే ఆ సమయంలో అతని చెప్పు ఊడిపోయింది. దీనిని గమనించిన అక్షయ్.. చేతితో చెప్పును తీసి ఆ వీడియోగ్రాఫర్‌కు ఇచ్చాడు. స్టార్ హీరో అన్న స్థాయిని పక్కన పెట్టి అలా చేసిన ఆ వీడియో.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక అక్షయ్‌ సినిమాల సంగతి చూస్తే.. ఈ మధ్య చేస్తున్న సినిమాలన్నీ బోల్తా కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న రానున్న ‘ఖేల్‌ ఖేల్‌ మే’ సినిమా మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు ఆయన అభిమానులు. వాణీ కపూర్‌ (Vaani Kapoor) , తాప్సీ (Taapsee Pannu) కతానాయికలుగా నటించిన చిత్రమిది. ఇక ఆయన వార్తల్లో నిలుస్తున్న విషయం గురించి చూస్తే.. చాలానే కనిపిస్తున్నాయి. అక్షయ్‌ ఇటీవల వరుసగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

ప్రముఖ గాయకుడు గ్లోరీ బవాకు రూ. 25 లక్షలు సాయం చేశాడు. ముంబయిలోని తన ఇంటి ఆవరణలో అన్నదానం నిర్వహించి.. స్వయంగా వడ్డించాడు. హాజీ అలీ దర్గా మరమ్మతుల కోసం రూ. కోటి విరాళం అందించాడు. దీంతో అక్షయ్‌ మనసుకు.. సినిమాల ఫలితానికి ఎలాంటి సంబంధం ఉండదని.. ఆయన ఎప్పుడు ఇలానే ప్రేమను పంచుతారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)

మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన విజయ్ దేవరకొండ.. ఏమైందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.