
స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయ్ దేవరకొండ మహేష్ బాబుకు (Mahesh Babu) పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ సార్.. మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పై థియేటర్లలో చూడటానికి మరీ ఎక్కువ కాలం వెయిట్ చేయించొద్దు.. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
Vijay Deverakonda, Mahesh Babu
అయితే మహేష్ ను బిగ్ స్క్రీన్ పై త్వరగా చూడాలంటే విజయ్ దేవరకొండ ఇదే విషయాన్ని జక్కన్నకు (S. S. Rajamouli) కూడా చెప్పాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ నుంచి అప్ డేట్స్ వస్తాయని భావించిన అభిమానులు మాత్రం ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో నిరాశకు గురయ్యారు.
వెంకటేశ్ (Venkatesh) , జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), అడివి శేష్ (Adivi Sesh), అనిల్ సుంకర (Anil Sunkara) , రష్మిక (Rashmika) , పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) , ప్రశాంత్ వర్మ (Prasanth Varma) , శ్రీ విష్ణు (Sree Vishnu) , మరి కొందరు సినీ ప్రముఖులు మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసమే మరో మూడేళ్లు పరిమితం అవుతారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్ గురించి స్పష్టత వస్తే కన్ఫ్యూజన్ కు చెక్ పడనుంది.
రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసి భారీ విజయాలను అందుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. స్క్రిప్ట్స్ సెలక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న మహేష్ బాబు భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.