March 18, 202503:01:51 AM

Alekhya Reddy: షర్మిల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.. అలేఖ్య కామెంట్స్ వైరల్!

తారకరత్న (Taraka Ratna) భార్య అలేఖ్యారెడ్డి (Alekhya Reddy) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తారకరత్న మరణం తర్వాత అలేఖ్యారెడ్డి పలు సందర్భాల్లో భర్తను తలచుకుంటూ చేసిన పోస్ట్ లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అలేఖ్యారెడ్డి, వైఎస్ షర్మిల కలిసి కనిపించడం గమనార్హం. అలేఖ్యారెడ్డి బర్త్ డేను షర్మిల సెలబ్రేట్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అలేఖ్యారెడ్డితో షర్మిల కేక్ కట్ చేయించడంతో పాటు తన పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరగడంతో అలేఖ్య ఒకింత ఎమోషనల్ అయ్యారు.

Alekhya Reddy

అలేఖ్య తన పోస్ట్ లో గత కొన్ని సంవత్సరాలుగా నా పక్కన ఉంటావని చేసిన ప్రామిస్ ను నువ్వు నిలబెట్టుకుంటున్నావు అక్క అంటూ చెప్పుకొచ్చారు. నాకోసం టైం కేటాయించి నా పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసినందుకు షర్మిలకు ధన్యవాదాలు అని ఆమె పేర్కొన్నారు. నాకు కన్నీళ్లు వస్తున్నాయని షర్మిల చేసే ప్రతి పని కూడా నాకు బ్లెస్సింగ్ లా అనిపిస్తోందని అలేఖ్య చెప్పుకొచ్చారు.

షర్మిల నాకెంత స్పెషల్ అనేది నేను చెప్పలేనని షర్మిల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని లవ్ యు షర్మిల అక్క అంటూ చెప్పుకొచ్చారు. అలేఖ్యారెడ్డి షేర్ చేసిన పోస్ట్ కు 16,000కు పైగా లైక్స్ వచ్చాయి. అలేఖ్యారెడ్డి మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలేఖ్యారెడ్డి ప్రస్తుతం పిల్లల కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.

పిల్లల్ని కెరీర్ పరంగా ఉన్నత చదువులు చదివించేలా అలేఖ్యారెడ్డి నిర్ణయాలు ఉన్నాయని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ (Balakrishna)  ఆర్థికంగా అలేఖ్య కుటుంబానికి అండగా నిలబడ్డారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలేఖ్యారెడ్డిని నందమూరి అభిమానులు ఎంతగానో అభిమానిస్తుండటం గమనార్హం. అలేఖ్యారెడ్డి పొలిటికల్ కెరీర్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

చై శోభిత నిశ్చితార్థం..సమంతని లాగుతున్న నెటిజన్లు.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.