March 21, 202512:17:32 AM

Boyapati Srinu: జై బాలయ్య స్లోగన్ గురించి బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?

బాలయ్య (Balakrishna) బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ అనగానే సింహా (Simha) , లెజెండ్ (Legend) , అఖండ (Akhanda)  సినిమాలు కళ్ల ముందు మెదులుతాయి. ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి మంచి లాభాలను అందించాయి. ఈ కాంబినేషన్ లో అఖండ సీక్వెల్ తెరకెక్కనుండగా ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జై బాలయ్య స్లోగన్ ఎంతో పాపులర్ అనే సంగతి తెలిసిందే. ఈ స్లోగన్ గురించి బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Boyapati Srinu

పేరు బాగుందని జై బాలయ్య అనట్లేదని ఆ స్లోగన్ వెనుక ఎనర్జీ ఉందని బోయపాటి శ్రీను అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఆ ఎనర్జీ కోసమే అందరూ జై బాలయ్య అంటుంటారని బోయపాటి శ్రీను పేర్కొన్నారు. స్టార్ హీరో బాలకృష్ణ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టి 50 సంవత్సరాలు పూర్తైంది. సెప్టెంబర్ నెల 1వ తేదీన హైదరాబాద్ లో ఈవెంట్ జరగనుండగా తాజాగా ఈ ఈవెంట్ కు సంబంధించిన కర్టెన్ రైజర్ ఈవెంట్ జరిగింది.

బాలయ్య బాబీ (Bobby)  కాంబో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాల్సి ఉంది. బాలయ్య మాస్ సినిమాలలో నటించడంతో పాటు పవర్ ఫుల్ డైలాగ్స్ తో మెప్పిస్తున్నారు. అఖండ2 షూట్ కు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. అఖండ2 సినిమా కథ, కథనం అద్భుతంగా ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. అఖండ2 సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ త్వరలో రానున్నాయని తెలుస్తోంది. అఖండ2 సినిమాతో భారీ హిట్ సాధించాలని బోయపాటి శ్రీను భావిస్తున్నారు.

కాలికి గాయమైనా ఆ పాట షూట్ పూర్తి చేసిన పవన్.. శ్రియ చెప్పిన విషయాలివే!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.