March 27, 202510:32:37 PM

టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్.. కానీ?

టాలీవుడ్లో ఒక దశలో మల్టీస్టారర్ల ట్రెండ్ కి కాలం చెల్లిపోయింది అనే కామెంట్లు వినిపించాయి. కానీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమా ఆ కామెంట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) లాంటి పాన్ ఇండియా మల్టీస్టారర్ వచ్చింది అంటే.. అది ‘సీతమ్మ వాకిట్లో..’ వల్లే అని చెప్పాలి.అయితే మిడ్ రేంజ్ హీరోలు చేసే మల్టీస్టారర్స్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపించడం లేదు. ‘శమంతకమణి’ (Shamanthakamani) ‘వీరభోగ వసంత రాయలు’ (Veera Bhoga Vasantha Rayalu) ‘వి’ (V) వంటి మల్టీస్టారర్స్ ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి.

అయితే అన్ని వేళలా ఇలాగే ఉంటుంది అనడానికి లేదు. కంటెంట్ బాగుంటే.. ఎలాంటి సినిమాలు అయినా ఆడతాయి. సరే త్వరలో ఓ క్రేజీ మల్టీస్టారర్ రాబోతుంది. వివరాల్లోకి వెళితే.. మిడ్ రేంజ్ హీరోలు అయినటువంటి బెల్లంకొండ శ్రీ‌నివాస్ (Bellamkonda Sai Sreenivas)… విజ‌య్ క‌న‌క‌మేడ‌ల (Vijay Kanakamedala) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో మంచు మ‌నోజ్‌ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohit) వంటి మిడ్ రేంజ్ హీరోలు కూడా నటిస్తారని సమాచారం.

అయితే మంచు మనోజ్, నారా రోహిత్..లు ఈ సినిమాలో ఎలాంటి పాత్రలు పోషిస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ మధ్య కొంతమంది హీరోలు విలన్లుగా కూడా నటిస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ‘మిరాయ్‌’లో (Mirai) మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. నారా రోహిత్ కూడా ‘శమంతకమణి’ ‘ఆటగాళ్లు’ (Aatagallu) వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు. కాబట్టి.. వీళ్ళు బెల్లంకొండ సినిమాలో నెగిటివ్ రోల్స్ చేస్తున్నారా? అనే డిస్కషన్స్ కూడా ఇప్పుడు ఊపందుకున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.