March 25, 202511:13:00 AM

Janhvi Kapoor: ఆ విషయంలో శ్రీదేవి – జాన్వీ ఒక్కటే.. స్టార్‌ యాక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

జాన్వీ కపూర్‌ని (Janhvi Kapoor)  జూనియర్‌ శ్రీదేవి (Sridevi) అని అంటుంటారు. అయితే ఆ పేరు రాకుండా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఆమె చాలా ఏళ్లుగా కష్టపడుతూనే ఉంది. గ్లామర్‌ ఒలకబోతకు సోషల్‌ మీడియాను ఎంచుకున్న ఆమె.. సినిమాల్లో మాత్రం ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలు చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది కూడా. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఉలఝ్‌’ విడుదలైంది.

జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదిల్‌ హుస్సేన్‌ ఓ కీలక పాత్రధారి. ఆయన ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జాన్వీ కపూర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వృత్తిపై ఆమెకున్న అంకితభావాన్ని మెచ్చుకుంటూనే శ్రీదేవికి, ఆమెకు మధ్య సారూపత్యల గురించి మాట్లాడారు. దీంతో ఆ మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రీదేవి ఫిల్మోగ్రఫీలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’.

ఆ సినిమాలో అదిల్‌ కూడా నటించారు. ఆ సినిమా సెట్స్‌లోనే తొలిసారి జాన్వీ కపూర్‌ను చూశారట. 14 ఏళ్ల వయసులో శ్రీదేవితో కలసి రోజూ సెట్‌కు వచ్చేదట. అలా వచ్చి ఖాళీగా ఉండకుండా తల్లి యాక్టింగ్‌ను ప్రతిక్షణం గమనించేదట. 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు జాన్వీ కథానాయికగా నటించిన ‘ఉలఝ్‌’లో నటించడం బాగుంది అని చెప్పారు అదిల్‌. వృత్తి పట్ల శ్రీదేవి ఏకాగ్రత, అంకితభావం.. జాన్వీ కపూర్‌లో కూడా చూశాను అని అదిల్‌ అంటున్నారు.

దర్శకుడు చెప్పిన విధంగా నటించడం, సన్నివేశాల గురించి అడిగి తెలుసుకోవడం, సెట్‌లో అందరినీ గౌరవించడం.. ఇలా చాలా విషయాల్లో జాన్వీని చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లే ఉంది అని అదిల్‌ అంటున్నారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఉలఝ్‌’ రూపొందింది. సినిమాకు, అందులో జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తెలుగులో ఆమె ‘దేవర’లో  (Devara) నటిస్తుండగా.. రామ్‌చరణ్‌ (Ram Charan) సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.