
హీరోయిన్లు మాత్రమే కాదు.. సినిమాల్లో నటించే ఫిమేల్ ఆర్టిస్ట్..లు అందరూ తమ గ్లామర్ పై, ఫిజిక్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. గ్లామర్ ని, ఫిజిక్ ని.. కాపాడుకున్న వారికే అవకాశాలు వస్తుంటాయి. లేదు అంటే వాళ్ళను సున్నితంగా పక్కన పెట్టేస్తారు ఫిలిం మేకర్స్. ఇప్పుడు ఓ నటి పరిస్థితి ఆల్మోస్ట్ అలానే ఉంది. వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) కలయికలో రూపొందిన ‘గోపాల గోపాల’ (Gopala Gopala) సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.
Gopala Gopala
2015 లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ కి రీమేక్ చిత్రమిది. డాలి అలియాస్ కిషోర్ పార్థసాని (Kishore Kumar Pardasani) డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో నటించిన వారందరికీ మంచి పేరొచ్చింది. ఇందులో గోపికా మాత పాత్ర చేసిన నటిని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆమె మరెవరో కాదు దీక్ష పంత్ (Diksha Panth). ‘ఒరేయ్ గోపాల్ రావ్’ అంటూ ఈమె పలికే డైలాగులకి వెంకటేష్ వేసే సెటైర్లు బాగా పేలాయి.
‘గోపాల గోపాల’ (Gopala Gopala) కి ముందు ‘వరుడు’ (Varudu) ‘రచ్చ’ (Racha) ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) వంటి సినిమాల్లో నటించింది. తర్వాత.. ‘ఆపరేషన్ 2019 ‘ (Operation 2019) వంటి సినిమాల్లో కూడా నటించింది. కానీ అవేవీ హిట్ అవ్వలేదు. తర్వాత ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 1 లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఈమెకు కలిసిరాలేదు. అయితే ఒకప్పుడు సన్నగా ఉన్న ఈమె ఇప్పుడు కొంచెం బొద్దుగా మారింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు చూసిన వాళ్ళు కూడా ఇదే మాట అంటున్నారు.
View this post on Instagram