March 25, 202511:53:02 AM

Koratala Siva: దేవర విషయంలో సరైన ట్రాక్ లో కొరటాల.. బాక్సాఫీస్ షేక్ కానుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర (Devara)  రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఒకవైపు టెన్షన్ పెరుగుతుండగా మరోవైపు ఈ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెరిగే విధంగా మేకర్స్ తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమా నుంచి తాజాగా విడుదలైన భైరా గ్లింప్స్ అదిరిపోయిందనే చెప్పాలి. ఈ గ్లింప్స్ సూపర్ గ్లింప్స్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)  ఈ సినిమాలో సరికొత్త లుక్స్ లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

Koratala Siva

రాజమౌళి  (S. S. Rajamouli) తన సినిమాలలో విలన్స్ ను పవర్ ఫుల్ గా చూపించి విజయాలను సొంతం చేసుకుంటారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో కొరటాల శివ సైతం రాజమౌళిని ఫాలో అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ పాత్రకు ధీటైన పాత్రలోనే సైఫ్ కనిపించనున్నారని క్లారిటీ వచ్చేసింది. దేవర సినిమాతో బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా అనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.

దేవర సినిమా ఇండస్ట్రీ హిట్ కావాలనే ఫ్యాన్స్ ఆకాంక్ష నెరవేరుతుందేమో చూడాల్సి ఉంది. దేవర సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర2 కోసం మాత్రం 2027 వరకు ఆగాల్సిందేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దేవర1 సినిమాను మించేలా దేవర2 సినిమాను ప్లాన్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర1 హిట్టైతే దేవర2 సినిమాకు బడ్జెట్ కూడా భారీ స్థాయిలో ఉండబోతుందని తెలుస్తోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ కు సైతం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. దేవర సినిమా సక్సెస్ కావడం ఇండస్ట్రీకి కూడా ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. దాదాపుగా రెండున్నర సంవత్సరాల గ్యాప్ తర్వాత తారక్ నటించి రిలీజవుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

నార్నె నితిన్ పని బాగుంది.. హ్యాట్రిక్ దిశగా అలా..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.