March 15, 202509:57:15 AM

Janhvi Kapoor, Imanvi Esmail: సోషల్ మీడియాలో ఈ క్రేజీ హీరోయిన్ల హవా.. వాళ్లకు షాకిచ్చారుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి మూడు, నాలుగు సంవత్సరాలకు ఒకసారి కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో పాటు తమ లుక్స్, యాక్టింగ్ స్కిల్స్, ఎక్స్ ప్రెషన్స్ తో అభిమానులకు దగ్గరవుతూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా ఇద్దరు హీరోయిన్ల పేర్లు తెగ వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్లలో ఒకరు జాన్వీ కపూర్ కాగా మరొకరు ఇమాన్వీ ఇస్మాయిల్ కావడం గమనార్హం. ఈ ఇద్దరు హీరోయిన్లు నటించిన తెలుగు సినిమాలేవీ ఇంకా రిలీజ్ కాలేదు.

Janhvi Kapoor, Imanvi Esmail

అయితే సోషల్ మీడియాలో మాత్రం తరచూ ఈ హీరోయిన్ల గురించి చర్చ జరుగుతోంది. ఇమాన్వీ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య దాదాపుగా 9 లక్షలకు చేరింది. ఈ హీరోయిన్ కు సోషల్ మీడియాలో ఏకంగా 2.5 లక్షల ఫాలోవర్లు పెరిగారు. మరో హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అయితే తెలుగులో వరుస సినిమాలతో బిజీ అయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ క్రేజీ హీరోయిన్లు ఫ్యాన్ ఫాలోయింగ్ తో షాకిస్తున్నారు.

నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రం మరో ఐదేళ్ల పాటు ఈ హీరోయిన్లకు తిరుగుండదని చెప్పవచ్చు. జాన్వీ కపూర్ పారితోషికం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ఇమాన్వి పారితోషికం మాత్రం కోటి రూపాయల రేంజ్ లో ఉంది. ఇమాన్వీ, జాన్వీ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

జాన్వీ కపూర్, ఇమాన్వీ నటించిన సినిమాలు విడుదలైతే ఈ హీరోయిన్లకు నిజంగా ఆ స్థాయిలో క్రేజ్ వస్తుందో లేదో క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్ లెవెల్, పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో ఎంట్రీ ఇస్తుండటం ఈ హీరోయిన్లకు వరమవుతోంది. జాన్వీ, ఇమాన్వీ కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్ల కెరీర్ ప్లాన్స్ ఇతర హీరోయిన్లకు భిన్నంగా ఉన్నాయి.

పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు అతను కూడా ఫైనల్ అయ్యాడా..?!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.