March 20, 202512:29:01 PM

Kanguva: మరోసారి పోస్ట్ పోన్ అయిన కంగువ.. ఈసారి ఆ పండుగకి ఫిక్స్ అంట.!

తమిళ ఇండస్ట్రీ నుండి రాబోయే అతిపెద్ద సినిమాల్లో “కంగువ” (Kanguva) ఒకటి. సూర్య (Suriya) ద్విపాత్రాభినయం పోషిస్తున్న ఈ చిత్రానికి శివ (Siva)  దర్శకుడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) ప్రతినాయకుడిగా, బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పఠానీ (Disha Patani) హీరోయిన్ గా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే రెండుసార్లు అనధికారికంగా వాయిదాపడి.. అక్టోబర్ 10కి విడుదలవుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అయితే.. నిన్న వచ్చిన ఇండస్ట్రీ సమాచారం మేరకు ఈ చిత్రం అనుకున్నట్లుగా అక్టోబర్ 10కి విడుదలవ్వడం లేదని తెలుస్తోంది.

Kanguva

నిజానికి ఈ చిత్రం విడుదల విషయంలో సందిగ్ధత రజనీకాంత్ (Rajinikanth) తాజా చిత్రం “వేట్టాయన్”  (Vettaiyan)  అక్టోబర్ 10కి విడుదల అని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసినప్పటినుండి మొదలయ్యింది. అయితే.. దసరా సెలవులు కాబట్టి రెండు సినిమాలకు థియేటర్లు సరిపోతాయి అనుకున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే.. “కంగువ” విషయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్నంత వేగంగా పూర్తవ్వకపోవడం, అవుట్ పుట్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సి రావడంతో దర్శకనిర్మాతలు ఈ చిత్రాన్ని దసరా పండుగకి కాకుండా..

దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ మొత్తం హడావుడిలో లాభపడింది మాత్రం రజనీకాంత్ అని చెప్పాలి. ఆయన మునుపటి చిత్రం “లాల్ సలాం” (Lal Salaam)ను పక్కనపెడితే.. ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన “జైలర్”కు (Jailer) దొరికినట్లుగా “వెట్టయాన్”కు కూడా సోలో రిలీజ్ దొరకడం, ఈ చిత్రంలో అమితాబ్ (Amitabh Bachchan) , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil)  , రానా దగ్గుబాటి (Rana) కీలకపాత్రలు పోషించడం,

“జై భీమ్” దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ (K. E. Gnanavel Raja) దర్శకత్వం వహించడం వంటి కారణాల వల్ల సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఒకవేళ “కంగువ”తోపాటుగా విడుదలయ్యుంటే మాత్రం కలెక్షన్స్ విషయంలో కాస్త దెబ్బ పడేది. ఇప్పుడు పోటీ లేకుండా సింగిల్ గా వస్తుండడంతో రజనీకాంత్ అండ్ టీమ్ చాలా హ్యాపీగా ఉన్నారంట. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.