March 21, 202501:01:41 AM

Priyanka Mohan: ఖుషీ 2 క్యూట్ రిక్వెస్ట్ పై మండిపడుతున్న కోలీవుడ్ ఫ్యాన్స్.!

కోలీవుడ్ లో స్థిరపడిన కన్నడిగ ప్రియాంక మోహన్ (Priyanka Mohan)  తెలుగులోనూ సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తోంది. ఈవారం ఆమె నటించిన “సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram) రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan)  సరసన “ఓజీ”  (OG)  సినిమాలోనూ నటిస్తోంది. అదే కాక తమిళంలో జయం రవి (Jayam Ravi) సరసన “బ్రదర్” అనే సినిమా కూడా చేసింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీ నుండి కొందరు దర్శకనిర్మాతలు ప్రియాంక కోసం క్యూలో ఉన్నారు కూడా.

Priyanka Mohan

ఈ తరుణంలో ప్రియాంక అనవసరంగా ఒక రచ్చలో ఇరుక్కుంది. ఇటీవల హైద్రాబాద్ లో జరిగిన “సరిపోదా శనివారం” ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రియాంక స్టేజ్ మీద మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో “ఖుషీ 2” (Kushi) తీయాలని ఎస్.జె.సూర్యను (SJ Surya) కోరిన విషయం ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని తెలుగు సినిమా అభిమానులు, పవన్ కల్యాణ్ అభిమానులు సరదాగానే తీసుకున్నా.. తమిళ సినిమా అభిమానులు మరియు విజయ్ (Vijay Thalapathy) ఫ్యాన్స్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు.

అసలు “ఖుషీ” మాతృక తమిళం అని, తీస్తే తమిళంలో విజయ్ తో తీయాలి కానీ తెలుగులో పవన్ కళ్యాణ్ తో తీయమని ప్రియాంక అడగడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమెను ట్విట్టర్ సాక్షిగా బూతులు తిడుతున్నారు. ప్రస్తుతానికి ఈ విషయం ఇండస్ట్రీ పరంగా పెద్ద విషయం కాకపోయినా.. ఇప్పటివరకు ఇలాంటి కాంట్రవర్సీలు లేకుండా కేవలం క్యూట్ నెస్ తో ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్న ప్రియాంకకు ఇది చిన్నపాటి ఝలక్ అనే చెప్పాలి.

ఈ విషయమై ప్రియాంకను తమిళ మీడియా ఇప్పుడు కాకపోయినా ఆమె తదుపరి తమిళ చిత్రమైన “బ్రదర్” ప్రమోషన్స్ లో అయినా నిలదీయడం అనేది జరగక తప్పదు. మరి ప్రియాంక ఈ విషయాన్ని ఎలా ఫేస్ చేస్తుందో, ముఖ్యంగా ఫుల్లు గుర్రు మీదున్న విజయ్ ఫ్యాన్స్ ను ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి!

ఆ ఏరియాలో అన్నయ్య రికార్డ్ ను తమ్ముడు బ్రేక్ చేయనున్నారా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.