March 28, 202503:18:59 PM

Mr. Bachchan Trailer Review: ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja)  హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) అనే అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో ‘షాక్’ (Shock)   ‘మిరపకాయ్'(Mirapakay)  వంటి సినిమాలు వచ్చాయి. అందులో ‘మిరపకాయ్’ సూపర్ హిట్ అవ్వడంతో ఈ కాంబినేషన్ పై మంచి క్రేజ్ నమోదైంది. ‘మిస్టర్ బచ్చన్’ టీజర్, షో రీల్, మూడు పాటలు.. వంటివి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి.

Mr. Bachchan

ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే  (Bhagyashri Borse)  లుక్స్ యూత్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు మేకర్స్. 2 నిమిషాల 25 సెకన్లు నిడివి కలిగిన ఈ ట్రైలర్…’సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు, సంపదని కాపాడేవాడు కూడా సైనికుడే’ అనే డైలాగ్ తో మొదలైంది.

రవితేజ పవర్ఫుల్ ఎంట్రీ, సత్య  (Satya)  కామిడీ, భాగ్య శ్రీ బోర్సే గ్లామర్ ట్రైలర్ కి ప్రధాన ఆకర్షణలు అని చెప్పాలి. ఈ ట్రైలర్ ద్వారా కథపై కొంత క్లారిటీ ఇచ్చారు అని చెప్పాలి. రవితేజ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంటుకి చెందిన ఆఫీసర్ అనే సంగతి తెలిసిందే. అయితే ఇతను ఒక బిగ్ షాట్ పై రైడ్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. ట్రైలర్ ను మీరు కూడా ఒకసారి చూడండి.

 ‘బిగ్ బాస్ 8’ హోస్ట్ పై క్లారిటీ వచ్చేసిందిగా.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.