
తమిళ నటుడు కమ్ కమెడియన్ మొట్టా రాజేంద్రన్ (Motta Rajendran) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నాన్ కడవుల్ రాజేంద్రన్..గా కూడా ఇతను ఫేమస్. ప్రస్తుతం ఆయన కమెడియన్ గా, సహాయ నటుడిగా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ‘సింగం 2’ (Singam II) ‘పోలీస్'(తేరి) (Theri) ‘కాంచన 2’ (Kanchana) ‘బాక్'(అరుణ్మనై 4) (Baak) వంటి సినిమాల్లో ఇతని నటనకి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. తెలుగులో కూడా ‘లక్ష్మీ’ (Lakshmi) ‘గుడుంబా శంకర్’ (Gudumba Shankar) ‘సఖియా’ ‘శ్రీ’ (Sree) ‘కితకితలు’ ‘ఛలో’ (Chal0) ‘ఎఫ్ 3’ (F3 Movie) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ‘సార్’ (Sir) ‘విమానం’ (Vimanam) వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు.
Motta Rajendran
అయితే మొదట.. అంటే కెరీర్ ప్రారంభంలో ఇతను డూప్ గా, స్టంట్ మాస్టర్ గా పనిచేసేవాడు. అప్పట్లో ఇతని రూపం బాగానే ఉండేదట. కానీ.. చెన్నైలో ఉన్న కళపేట అనే ఏరియాలో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఆ సినిమాకు సంబంధించిన నటుడుని కొట్టి చెరువులో దూకాల్సి ఉందట. కానీ ఆ చెరువులో చాలా కెమికల్స్ ఉన్నాయి. ఆ విషయం చిత్ర బృందం కూడా తెలుసుకోలేదట.
రాజేంద్రన్ కి కూడా తెలీక అతను ఆ చెరువులో దూకేశాడు. చిత్ర బృందం నిర్లక్ష్యం వల్ల అతని జుట్టు మొత్తం ఊడిపోయింది. శరీరం రంగు కూడా మారిపోయింది. భవిష్యత్తులో జుట్టు పెరిగే అవకాశం ఉండదని డాక్టర్లు ముందుగానే చెప్పారట. కనీసం రాజేంద్రన్ కి కను బొమ్మల జుట్టు కూడా ఉండకుండా పోయింది. శరీరం రంగు కూడా మారిపోగా..
మరోపక్క జీర్ణశాయం, ఇతర శ్వాసకోశ సమస్యలు కూడా తలెత్తాయి అని తెలుస్తుంది. ఆ టైంలో చికిత్సకి డబ్బులు కూడా అతని వద్ద లేవట. దీంతో అతను మానసికంగా కుంగిపోయాడు. కొన్నాళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి కమెడియన్ గా, సహాయ నటుడిగా లేదంటే విలన్ గ్యాంగ్లోని ఓ రౌడీగా.. నటిస్తూ వస్తున్నాడు.