March 23, 202506:29:04 AM

Mr Bachchan: ‘మిస్టర్‌’ బచ్చన్‌లో అతిథి పాత్రలో యువ హీరో… స్పెషల్‌గా ఉందంటూ..!

రవితేజ (Ravi Teja) , హరీశ్‌ శంకర్‌ (Harish Shankar)  కలిస్తే ఏదో మ్యాజిక్‌ ఉంటుంది. సినిమా ఫలితం కూడా బాగానే ఉంటుంది. ఏదో తొలి ప్రయత్నం తేడా కొట్టింది అనుకోండి. రవితేజలోని ఎనర్జీ, హరీశ్‌లోని మాస్‌ టచ్‌ కలసి ఆ సినిమాలోని సీన్స్‌ బాగా ఎలివేట్‌ అవుతుంటాయి. అందుకే అదో డెడ్లీ మాస్‌ కాంబో. ఇలాంటి కాంబినేషన్‌కి మరో ఎనర్జి కలిస్తే ఇక ఆ సినిమా లెవలే వేరు అని చెప్పాలి. ఇప్పుడు ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan)  విషయంలో అదే జరిగింది అంటున్నారు.

రవితేజ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)  కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు (Jagapathi Babu)  విలన్‌గా నటించారు. ఆగస్టు 15కి విడుదల అవ్వడానికి రెడీ అవుతున్న ఈ సినిమాలో యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) అతిథి పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఈ మేరకు సిద్ధు పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవల పూర్తయిందని అని చెబుతున్నారు. సినిమాలో ఓ ఫైట్‌లో సిద్ధు తళుక్కున మెరవనున్నాడని చెబుతున్నారు.

ఇక ‘మిస్టర్‌’ బచ్చన్‌ సినిమా విషయానికొస్తే.. 1980-90ల మధ్య కాలంలో జరిగే కథ ఇది. హిందీలో ‘రైడ్‌’ అనే పేరుతో అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) చేసిన సినిమాను ఇక్కడ ‘.. బచ్చన్‌’ పేరుతో తెరకెక్కించారు. అయితే అసలు సినిమా చూసినవాళ్లకు కూడా ఈ సినిమా కొత్తగా ఉంటుంది అని అంటున్నారు. దీనికి హరీశ్‌ శంకర్‌ గతంలో చేసిన రీమేక్‌ల కథాకమామీషు చెబుతున్నారు. ‘గబ్బర్‌ సింగ్’ (Gabbar Singh) (దబంగ్‌), ‘గద్దలకొండ గణేష్‌’ (జిగర్‌తండ) (Gaddalakonda Ganesh) ఫలితాలే ‘మిస్టర్‌ బచ్చన్‌’ మీద అంచనాలు పెరగడానికి కారణం అని అంటున్నారు.

ఆ రెండు సినిమాలు రీమేక్‌లే అయినా రెండూ డిఫరెంట్‌గా చేశారు హరీశ్‌ శంకర్‌. అయితే ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందో అనేది ఆసక్తిగా మారింది. అన్నట్లు టాలీవుడ్‌లో క్యూట్‌ కంటే క్యూటర్‌గా హీరోయిన్లను తీసుకొస్తారు అనే పేరున్న హరీశ్‌ ఈసారి భాగ్యశ్రీ బోర్సేను తెచ్చారు. మరి ఈ క్యాడ్‌బరీ భామ ఏం చేస్తుందో చూడాలి. ఇక్కడ జెండా గట్టిగా పాతేయాలనే ఉద్దేశంతో ఆమె ఈ సినిమాలో తన డబ్బింగ్‌ తనే చెప్పుకుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.