March 25, 202511:21:25 AM

Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ లో ఆ సీన్స్ కి కత్తెర?

మాస్ మహారాజ్ రవితేజ  (Ravi Teja) , దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) ..ల కలయికలో ‘మిరపకాయ్’ (Mirapakay)   వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) . ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టీజీ విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad)  నిర్మించిన ఈ చిత్రంతో భాగ్య శ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్ గా పరిచయమైంది. ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. 14 రాత్రి నుండి ప్రదర్శింపబడిన ప్రీమియర్స్ తోనే మంచి టాక్ దక్కించుకుంది.

Mr Bachchan

అలాగే మొదటి రోజు మంచి ఓపెనింగ్స్..నే తీసుకుంది ‘మిస్టర్ బచ్చన్’. ఫస్ట్ హాఫ్ లో వచ్చే నాన్ స్టాప్ కామెడీ సీన్స్.. ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక ఇంటర్వెల్ నుండి మొదలయ్యే ‘రైడ్’ ఎపిసోడ్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. అయితే సెకండాఫ్ లో ఒక్కటే ఇంట్లో ఎక్కువ సేపు కథ నడిపించడం.. అనేది ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టింది. అందుకోసమే ‘మిస్టర్ బచ్చన్’ నిడివి పై ఫోకస్ పెట్టారు మేకర్స్.

మొదటి రోజు ఆడియన్స్ టాక్ ని, క్రిటిక్స్ అభిప్రాయాన్ని ఆధారం చేసుకుని 13 నిమిషాలు ట్రిమ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ముందుగా ‘మిస్టర్ బచ్చన్’ రన్ టైం 2 గంటల 38 నిమిషాలుగా ఉంది. ఇప్పుడు 13 నిమిషాలు ట్రిమ్ చేస్తున్నారు కాబట్టి.. 2 గంటల 25 నిమిషాల రన్ టైం కలిగి ఉంటుంది ‘మిస్టర్ బచ్చన్’. లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి ఇది సరైన నిర్ణయం అనే చెప్పుకోవాలి.

నేషనల్ అవార్డు కొట్టిన ‘ఆట్టం’ గురించి ఈ విషయాలు మీకు తేలుసా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.