March 30, 202507:36:28 PM

Niharika: క్లీంకార కోసం చరణ్ అంతలా కష్టపడతాడు.. నిహారిక కామెంట్స్ వైరల్!

మెగా డాటర్ నిహారికకు  (Niharika)  ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. నటిగా, నిర్మాతగా ప్రయాణం చేస్తూ నిరంతరం కష్టపడుతున్న నిహారికను నెటిజన్లు ఎంతో మెచ్చుకుంటున్నారు. చరణ్  (Ram Charan)  గురించి, క్లీంకార గురించి నిహారిక కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. చరణ్ అన్న ప్రపంచంలోనే బెస్ట్ డాడ్ అంటూ నిహారిక ప్రశంసల వర్షం కురిపించారు. క్లీంకార చాలా అల్లరి చేస్తుందని ఇప్పటివరకు నేను చూసిన వాళ్లలో చరణ్ అన్న ప్రపంచంలోనే బెస్ట్ డాడీ అని నిహారిక కామెంట్లు చేశారు.

క్లీంకారకు అన్నం పెట్టడానికి చరణ్ ఎంతో కష్టపడతారని నిహారిక చెప్పుకొచ్చారు. కుక్క పిల్లలను, పక్షులను చూపించి క్లీంకారకు చరణ్ అన్నం తినిపిస్తాడని ఆమె కామెంట్లు చేశారు. చరణ్ అన్న స్టార్ హీరోగా కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కూతురికి సమయం కేటాయిస్తాడని నిహారిక పేర్కొన్నారు. చరణ్ అన్నను చూస్తే సినిమాలు లేకుండా కూతురికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడా అని అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు.

చరణ్ అన్న వర్క్ లైఫ్ ను , పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారని ఆమె వెల్లడించారు. క్లీంకార మాకు గోల్డెన్ డార్లింగ్ అని నిహారిక పేర్కొన్నారు. నిహారిక చరణ్, క్లీంకార గురించి చేసిన కామెంట్లు అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఫ్యామిలీ నుంచి నాకు మంచి సపోర్ట్ ఉంటుందని చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఓటీటీలోకి వచ్చానని నిహారిక వెల్లడించారు.

మంచి సినిమాకు నిర్మాతగా వ్యవహరించే అవకాశం దక్కడంతో కమిటీ కుర్రోళ్లు సినిమాకు నిర్మాతగా పని చేశానని ఆమె చెప్పుకొచ్చారు. ముద్దపప్పు ఆవకాయ్ సిరీస్ కథ నేనే రాశానని ఆ సిరీస్ కు నేను నిర్మాతగా వ్యవహరించడం జరిగిందని నిహారిక కామెంట్లు చేశారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.