March 27, 202504:19:22 PM

Raj Tarun & Lavanya Controversy: రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి లావణ్య రచ్చ.!

రాజ్ తరుణ్ (Raj Tarun) , లావణ్య..ల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న తన ‘తిరగబడరసామి’ సినిమా ప్రమోషన్స్ లో ‘నేను ఈ విషయంపై లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. నా దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ కోర్టుకు సమర్పిస్తాను’ అంటూ రాజ్ తరుణ్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్న ప్రదేశానికి లావణ్య వెళ్లి … అక్కడ ప్రెస్ తో మళ్ళీ ఈ విషయంపై ముచ్చటించడం జరిగింది.

‘అప్పుడే పిల్లలు వద్దు అంటూ 2 సార్లు అబార్షన్ చేయించాడు’ అంటూ ఆమె మళ్ళీ షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. మరోపక్క రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా సైలెంట్ గా అక్కడి నుండి జారుకున్నారు. మరోపక్క రాజ్ తరుణ్… ‘నేను కడుపు చేశాననడానికి సాక్ష్యం ఏంటి… అబార్షన్ కు సంబంధించిన ఆధారాలెక్కడ. ఎఫ్ఐఆర్ లో అబార్షన్ మేటర్ ఎందుకు పెట్టలేదు’ అంటూ డిఫెండ్ చేసుకున్నాడు. దీంతో ఆ ఆధారాలు తీసుకొని మాదాపూర్ లో ఉన్న రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళింది లావణ్య.

అక్కడికి వెళ్లి తలుపు తట్టిన లావణ్య…’ఆధారాలు తెచ్చాను తలుపు తీయమని’ చెప్పింది. కానీ రాజ్ తరుణ్ కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ తలుపు తీసింది లేదు. బయటకు వచ్చి రాజ్ తరుణ్ నెంబర్ కి లావణ్య ఫోన్ చేయగా.. అతను లిఫ్ట్ చేయలేదు. దీంతో కాసేపటి వరకు అక్కడ రచ్చ చేసి.. తర్వాత వెళ్ళిపోయింది. మరోపక్క రాజ్ తరుణ్ – లావణ్య..ల పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్లో లీక్ అయినట్లు టాక్ నడుస్తుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.