March 23, 202507:26:30 AM

Ram Charan: రానా వల్లే నాకు తక్కువ మార్కులొచ్చాయి.. చరణ్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ (Ram Charan) , రానా (Rana) మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ క్లాస్ మేట్స్ అనే విషయం అభిమానులలో చాలామందికి తెలుసు. అయితే రానాతో స్నేహం గురించి చరణ్ ఒక సందర్బంలో షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. చరణ్ మాట్లాడుతూ 8వ తరగతి నుంచి నేను రానా కలిసి చదువుకున్నామని కామెంట్లు చేశారు. నాకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని అడిగితే రానా నా ముందు కూర్చుంటే బోర్డ్ ఏం కనిపిస్తుందని అని చెప్పేవాడినని చరణ్ పేర్కొన్నారు.

Ram Charan

నేను హైట్ పెరగాలని అమ్మ బలమైన వంటలు చేసి పంపించేదని రామ్ చరణ్ వెల్లడించారు. రానా హైట్ పెరిగాడు కానీ నేను పెరగలేదని ఆయన చెప్పుకొచ్చారు. రానాకు సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి పెద్ద క్యారేజ్ వచ్చేదని నాకేమో చిన్న క్యారేజ్ వచ్చేదని చరణ్ కామెంట్లు చేశారు. రానా తన క్యారేజ్ అంతా తిని చరణ్.. నీ క్యారేజ్ లో ఏముందిరా అని అడిగేవాడని రామ్ చరణ్ పేర్కొన్నారు.

రానా నా క్యారేజ్ కూడా తినేవాడని చరణ్ చెప్పుకొచ్చారు. రానా నా స్నేహితుడు అయినందుకు ఎంతో గర్వపడుతున్నానని రామ్ చరణ్ తెలిపారు. చాలా సంవత్సరాల క్రితం రామ్ చరణ్ ఈ విషయాలు వెల్లడించగా అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చరణ్, రానా మధ్య స్నేహం కలకాలం కొనసాగాలని ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో సినిమాలు సైతం రావాలని అభిమానులు భావిస్తున్నారు.

రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా దిశగా అడుగులు పడతాయేమో చూడాల్సి ఉంది. చరణ్, రానాలకు సోషల్ మీడియా వేదికగా క్రేజ్ పెరుగుతోంది. ఈ ఇద్దరు హీరోలు విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.