
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో తన నటనతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో అభినయ (Abhinaya) ఒకరు. తన ప్రతిభతో మాటలు రాకపోయినా, వినపడక పోయినా నటిగా అభినయ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu) , దమ్ము (Dammu) , ధృవ (Dhruva), సీతారామం (Sita Ramam) , ది ఫ్యామిలీ స్టార్ (The Family Star) మరికొన్ని సినిమాలలో నటించి తన నటనతో అభినయ మెప్పించారు. అయితే కొన్నిరోజుల క్రితం ఈ ప్రముఖ నటి ఇంట విషాదం చోటు చేసుకుంది.
Abhinaya
అభినయ తల్లి అకస్మాత్తుగా మృతి చెందారు. ఆగష్టు నెల 17వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా సోషల్ మీడియా వేదికగా అభినయ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అమ్మ లేదనే విషయాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అభినయ పోస్ట్ లో పేర్కొన్నారు. అమ్మ ఇలా అకస్మాత్తుగా వదిలేసి వెళ్లిపోతుందని అనుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు. తాతలా అమ్మ కూడా రిక్షాలోనే చనిపోయిందని తండ్రి కూతురు ఒకేలా మరణించడం ఎంత యాదృచ్ఛికమో కదా అని అభినయ వెల్లడించారు.
అమ్మ లేకపోతే నేను ఇంత సాధించేదాన్ని కాదని ప్రతిచోటా అమ్మ నన్ను సపోర్ట్ చేస్తూ అండగా నిలబడిందని ఇప్పుడు అమ్మ బాధ్యతను సాయిసునందన్ తీసుకుంటాడని ఆమె పేర్కొన్నారు. మరో జన్మంటూ ఉంటే మళ్లీ మళ్లీ ఈ అమ్మకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నా అని ఆమె అన్నారు. అభినయ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. అభినయ తల్లి మరణించిన బాధ నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడు ఆమెకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చాలామంది నటీమణులతో పోల్చి చూస్తే అభినయ సక్సెస్ రేట్ ఎక్కువ కాగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే. అభినయ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
View this post on Instagram