March 25, 202512:09:35 PM

Buddy Collections: డిజాస్టర్ గా మిగిలిన అల్లు శిరీష్ ‘బడ్డీ’.!

అల్లు శిరీష్ (Allu Sirish) సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంటాడు. అందరి హీరోల్లా వేగంగా చేయడు. తాజాగా అతను ‘బడ్డీ’ (Buddy) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్న అంటే ఆగస్టు 2న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.ఆర్య (Arya) ,సాయేషా (Sayyeshaa Saigal)  కాంబినేషన్లో రూపొందిన ‘టెడ్డీ’ సినిమాని పలు మార్పులతో తెలుగులో రీమేక్ చేశారు.మొదటి నుండి ఈ సినిమా పై బజ్ లేదు. కానీ ‘చిన్న పిల్లల సినిమా ఇది, వాళ్ళని ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉన్నాయంటూ’ టీం కొత్త పంథాలో ప్రమోషన్ చేసింది. కానీ వారి ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు.

Buddy Collections

మొదటిరోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.వీక్ డేస్ లో ఇంకా డౌన్ అయ్యింది. ఒకసారి (Buddy Collections) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.33 cr
సీడెడ్ 0.18 cr
ఆంధ్ర 0.29 cr
ఏపీ +తెలంగాణ 0.80 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.12 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.92 cr

‘బడ్డీ’ రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో ఈ సినిమా అతి కష్టం మీద రూ.0.92 కోట్లు షేర్ ను రాబట్టింది. టికెట్ రేట్లు తగ్గించామని ప్రమోషన్ చేసినప్పటికీ.. టాక్ నెగిటివ్ గా రావడం వల్ల… ఆశించిన ఓపెనింగ్స్ రాలేదు. బ్రేక్ ఈవెన్ కి రూ.4.08 కోట్ల(షేర్) దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది ఈ మూవీ.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.