March 18, 202502:39:06 PM

సినిమా రూపం దాలుస్తున్న ప్రముఖ బిజినెస్‌ మ్యాన్‌ జీవితం.. కానీ..!

‘జై భీమ్‌’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌ (T. J. Gnanavel)  . ఇప్పుడు ఆయన రజనీకాంత్‌ (Rajinikanth)  హీరోగా ‘వేట్టయాన్‌’ (Vettaiyan)  అనే సినిమా చేస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా విడుదలకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా తర్వాత జ్ఞానవేల్‌ చేసే కొత్త సినిమా ఏంటి అనే వివరాలను వెల్లడించారు. ఈసారి కూడా ఆయన వార్తల్లో నిలిచిన అంశాన్నే ఎంచుకున్నారు. ‘దోశ కింగ్‌’ (Dosa King) పేరుతో ఆయన ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Dosa King

హిందీలో తెరకెక్కనున్న ఈ సినిమాను జంగ్లీ పిక్చర్స్‌ నిర్మించనుంది. ఇక సినిమా కథాంశం గురించి చూస్తే.. తమిళనాడులో దోశ కింగ్‌గా ప్రాచుర్యం పొందిన శరవణ భవన్‌ హోటల్స్‌ అధినేత రాజగోపాల్‌ చేసిన ఓ హత్య నేపథ్యంగా ఈ సినిమా ఉండబోతోంది. ఫిక్షనల్‌ క్రైమ్‌ డ్రామాగా సిద్ధం కానున్న ఈ సినిమాను దేశంలోని అన్ని ప్రధాన భాషల్లోనూ రిలీజ్‌ చేస్తారు అని చెప్పొచ్చు. శరవణ రాజగోపాల్‌ జాతకాల పిచ్చితో తన వద్ద పని చేసే ఓ అసిస్టెంట్‌ కూతురు జీవన జ్యోతిని మూడో భార్యగా వివాహం చేసుకోవాలని అనుకున్నాడు.

అయితే అప్పటికే ఆమెకు శాంతకుమార్‌తో పెళ్లవడంతో అతన్ని హత్య చేయించాడు. 2001లో బయటకు వచ్చిన ఈ వార్త, కేసు అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. ఈ కేసు విషయంలో శాంతకుమార్‌ భార్య జీవజ్యోతి చేసిన పోరాటం ఆధారంగానే సినిమా ఉండబోతోంది అని అంటున్నారు. ఈ సినిమా కోసం జ్ఞానవేల్‌తోపాటు హేమంత్‌ కూడా పని చేస్తున్నారు.

‘సప్తసాగరాలు సైడ్‌ ఏ’, ‘సప్తసాగరాలు సైడ్‌ బి’ సినిమాల దర్శకుడే ఈ హేమంత్‌. ఆయన గతంలో శ్రీరామ్‌ రాఘవన్‌తో కలసి ‘అంధాధున్‌’ సినిమాను కూడా రాశారు. ఇప్పుడు ఆయనే ‘దోశ కింగ్‌’ (Dosa King)  సినిమాను రాస్తున్నారు. త్వరలోనే కాస్ట్‌ అండ్‌ క్రూను అనౌన్స్‌ చేస్తారు.

బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన టాస్క్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.