March 20, 202508:07:54 PM

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

Vikas Sethi

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. నిత్యం ఎవరో ఒక సెలబ్రిటీ మరణిస్తూనే ఉన్నారు. అయితే నటీనటులు, నిర్మాతలు, దర్శకులు లేదా ఇతర సాంకేతిక నిపుణులు, వాళ్ళు కాదు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు ఇతర భాషల్లోని సినీ ప్రముఖులు కూడా ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక ప్రముఖ నటుడు మరణించడం చర్చనీయాంశం అయ్యింది.

బాలీవుడ్ ఇండస్ట్రీ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు వికాస్ సేథీ (Vikas Sethi) గుండెపోటుతో మృతి చెందారు. అతని వయస్సు కేవలం 48 యేళ్ళు మాత్రమే కావడం మరింత విషాదకరం అని చెప్పాలి. మహారాష్ట్రలో ఉన్న నాసిక్ లో ఇతను మృతి చెందినట్టు తెలుస్తుంది. హిందీలో రూపొందిన పలు సక్సెస్ఫుల్ సీరియల్స్ , అలాగే సినిమాల్లో ఇతను నటించి మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.

Vikas Sethi

Vikas Sethi

కహీ తో, దిల్ న జానే క్యోన్, ఉతరన్, సంస్కార్ లక్ష్మీ, ససురాల్ సిమర్ కా సీరియల్స్ లో నటించాడు. అలాగే కభీ ఖుషీ కభీ గమ్’ వంటి హిట్ సినిమాలో నటించాడు. తెలుగులో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా ధరమ్ అనే పోలీస్ పాత్రలో నటించాడు. కెరీర్ సాఫీగా సాగుతున్న టైమ్లో ఇలా జరగడంతో అతని ఫ్యామిలీ కన్నీరు మున్నీరు అవుతుంది.

‘గోట్‌’ తెచ్చిన తలనొప్పి.. మన కష్టం కన్నడోళ్లకు ఇప్పుడు తెలిసొచ్చిందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.