March 22, 202509:12:27 PM

Committee Kurrollu Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కమిటీ కుర్రోళ్ళు’.!

నిహారిక కొణిదెల  (Niharika Konidela)  నిర్మాణంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu)  అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యదు వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 9న రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా.. మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. పెద్దగా తెలిసిన మొహాలు ఏమీ లేకపోయినా గోదావరి బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీ కావడం, సినిమాలో నోస్టాల్జిక్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.

Committee Kurrollu Collections:

అందువల్ల బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మూవీ బాగా కలెక్ట్ చేసింది. కొత్త సినిమాలు, క్రేజీ రీ రిలీజ్ సినిమాలు పోటీగా రిలీజ్ అయినా ‘కమిటీ కుర్రోళ్ళు’ బాక్సాఫీస్ వద్ద స్టడీ రన్ ని కంటిన్యూ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.50 cr
సీడెడ్ 0.70 cr
ఆంధ్రా (టోటల్) 3.02 cr
ఏపీ +తెలంగాణ (టోటల్) 7.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.12 cr
ఓవర్సీస్ 0.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 7.64 cr

‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం రూ.3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఏకంగా రూ.7.64 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

‘బిగ్‌బాస్‌ 8’ నుండి అభయ్‌ ఔట్‌.. 8 ఏళ్లలో తొలిసారి రెడ్‌ కార్డుతో ఫైర్‌!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.