March 15, 202502:53:03 PM

Devara: చుట్టమల్లే సాంగ్ ఖాతాలో సంచలన రికార్డ్స్.. అనిరుధ్ మ్యాజిక్ పని చేసిందిగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  దేవర (Devara) సినిమా నుంచి కొన్ని వారాల క్రితం విడుదలైన చుట్టమల్లే సాంగ్ ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పించింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా చుట్టమల్లే తెలుగు వెర్షన్ మరికొన్ని గంటల్లో 100 మిలియన్ల వ్యూస్ రికార్డ్ ను సొంతం చేసుకోనుంది. మరోవైపు ఈ సాంగ్ మరో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచింది.

Devara

మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ స్పాటిఫైలో ఈ సాంగ్ కు ఒక్కరోజులో ఏకంగా 10 లక్షలకు పైగా స్ట్రీమ్స్ వచ్చాయట. గతంలో ఏ సాంగ్ కు దక్కని ఈ రికార్డ్ చుట్టమల్లే సాంగ్ కు మాత్రమే సొంతమైందని సమాచారం అందుతుండటం గమనార్హం. అనిరుధ్ (Anirudh Ravichander) మ్యాజిక్ ఈ సాంగ్ విషయంలో మరోసారి పని చేసిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చుట్టమల్లే సాంగ్ ఖాతాలో నెవర్ బిఫోర్ రికార్డ్ చేరడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

చుట్టమల్లే సాంగ్ కు సంబంధించిన కవర్ సాంగ్స్, రీల్స్ సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. చుట్టమల్లే సాంగ్ సంచలనాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చుట్టమల్లే సాంగ్ కు వచ్చిన మంచి రెస్పాన్స్ తో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. దేవర సినిమా నుంచి విడుదలయ్యే తర్వాత పాటలు సైతం అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

దేవర (Devara) మూవీ ఇతర భాషల హక్కులకు సైతం ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి కలెక్షన్ల పరంగా మరికొన్ని రికార్డ్స్ చేరితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు అయితే ఉండవని చెప్పవచ్చు. దేవర టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సోషల్ మీడియా విజ్ఞప్తికి స్పందించిన సందీప్.. ఎంత సాయం చేశారంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.