March 14, 202511:49:46 PM

Saripodhaa Sanivaaram: సరిపోదా సినిమాతో నాని అక్కడ కూడా సక్సెస్ అయ్యారా?

న్యాచురల్ స్టార్ నాని (Nani)   , ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan)  కాంబినేషన్ లో వివేక్ ఆత్రేయనివారం అనేది ఎందుకంత స్పెషల్ అనేది వివేక్ ఆత్రేయ  (Vivek Athreya) డైరెక్షన్ లో తెరకెక్కిన సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)  మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని థియేటర్లలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ గా నటించగా ఎస్జే సూర్య పర్ఫామెన్స్ కు సైతం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. కొన్ని సన్నివేశాల్లో నానిని ఎస్జే సూర్య  (SJ Suryah)  డామినేట్ చేశారు.

Saripodhaa Sanivaaram

తమిళంలో ఈ సినిమా సూర్యాస్ సాటర్డే పేరుతో విడుదల కాగా తమిళంలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తో పాటు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తమిళంలో ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది. సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) తమిళ వెర్షన్ సైతం హిట్ గా నిలిచిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవాలని నాని భావిస్తున్నారు.

అయితే సరిపోదా శనివారం సినిమాతో నాని కల కొంతమేర నెరవేరినట్టేనని చెప్పవచ్చు. నాని భవిష్యత్తులో నటించే సినిమాలు సైతం తమిళనాడులో మంచి కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సరిపోదా శనివారంతో నాని కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్టేనని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాని శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబో మూవీ షూట్ త్వరలో మొదలుకానుండగా ఈ సినిమాతో పాటు నాని హిట్3 సినిమాలో నటించనున్నారు. నాని సినిమాల బడ్జెట్ అంతకంతకూ పెరుగుతుండగా యంగ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తూ క్రేజ్ పెంచుకుంటున్నారు. నాని పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. న్యాచురల్ స్టార్ నాని రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇకపై అలాంటి ఘటనలు జరగకూడదు.. బాలయ్య కామెంట్స్ వైరల్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.