April 2, 202502:03:38 AM

Fahadh Faasil: బాలీవుడ్‌కి వెళ్తున్న షెకావత్‌ సర్‌… డ్రీమ్‌ కాంబినేషన్‌ సెట్‌..!

కొన్ని ఫుడ్స్‌ గురించి వింటుంటేనే నోరూరుపోతుంటుంది. అలాగే సినిమాల్లో కొన్ని కాంబినేషన్ల గురించి వింటుంటేనే మనసు మురిసిపోతుంది. ఆ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఫీల్‌ తెలిసినవాళ్లకే ఆ ఫీలింగ్‌ కలుగుతుంటుంది. సేమ్‌ ఇండస్ట్రీలోనే సినిమాలు చేసే మన దగ్గర.. పక్క ఇండస్ట్రీ దర్శకుడితో మన హీరో సినిమా చేస్తే బాగుండు అని కచ్చితంగా అనిపిస్తుంది. అలా ఇప్పుడు ఓ డ్రీమ్‌ కాంబో సెట్‌ అయింది అని అంటున్నారు. హిందీ – నాన్‌ హిందీ కాంబినేషన్‌..

Fahadh Faasil

చాలా ఏళ్లుగా కలగానే మిగిలిపోయిన ఈ ఆలోచన ఇప్పుడు నెరవేరుతోంది. పాన్‌ ఇండియా ఫీవర్‌.. కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల అక్కడివాళ్లు, ఇక్కడి వాళ్లు కలసి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ దర్శకుడు, మాలీవుడ్‌ హీరో కలసి ఓ సినిమా చేయబోతున్నారు. అదే ఇంతియాజ్‌ అలీ – ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil). అవును ఈ కాంబో సెట్‌ అయింది. మలయాళ, తెలుగు, తమిళ చిత్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ఫహాద్‌ ఫాజిల్‌.

కథానాయకుడిగా, నటుడిగా వరుస సినిమాలు చేస్తున్న ఫహాద్‌.. ఇప్పుడు ఓ హిందీ సినిమా ఓకే చేశారట. ఆ సినిమాతో త్వరలో ఫహాద్‌  (Fahadh Faasil) బాలీవుడ్‌లోకి అడగుపెట్టనున్నట్లు సమాచారం. ప్రముఖ హిందీ దర్శకుడు ఇంతియాజ్‌ అలీతో ఈ సినిమాను హ్యాండిల్‌ చేస్తారు అని చెబుతున్నారు. తనదైన శైలిలో ఇంతియాజ్‌ అలీ ఈ సినిమాను ప్రేమకథగా రూపొందిస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ దశలో ఉన్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ త్వరలో ఉంటుంది అని చెబుతున్నారు.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫహాద్‌ (Fahadh Faasil) సరసన నటించే కథానాయిక కోసం వెతుకులాట జరుగుతోందట. మరోవైపు ఫహాద్‌ ఫాజిల్‌ సినిమాలు చూస్తే.. అల్లు అర్జున్‌ (Allu Arjun) – సుకుమార్‌ (Sukumar) ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2), రజనీకాంత్‌ (Rajinikanth)318, 521187, 521279 ‘వేట్టయాన్‌’ (Vettaiyan) లో కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళ సినిమాలు ‘ఒడుమ్‌ కుతిర చడుమ్‌ కుతిర’, ‘బౌగెయిన్‌విల్లే’ చేస్తున్నారు. ఇక తెలుగులో స్ట్రెయిట్ సినిమాగా ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ చేస్తున్నారు.

‘సరిపోదా శనివారం’ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. బ్రేక్ ఈవెన్ కి ఛాన్స్ ఉందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.