
నందమూరి బాలకృష్ణ (Balakrishna) అభిమానులు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్మెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మొత్తానికి ఆ గడియలు రానే వచ్చేశాయి. నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) డెబ్యూ మూవీ ‘హనుమాన్’ (Hanuman) ప్రశాంత్ వర్మతో (Prasanth Varma) చేస్తున్నాడు. ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్ తో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ముందు నుండీ ప్రచారం జరిగినట్టుగానే ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ‘లెజెండ్’ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎం తేజస్విని నందమూరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
Nandamuri Mokshagnya
ఇక మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్'(పి వి సి యు) లో భాగమే అనే సంగతి అందరికీ తెలిసిందే. దీనికి కూడా సోసియో ఫాంటసీ టచ్ ఉంటుందట. బాలకృష్ణ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నట్టు కూడా టాక్ నడిచింది. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈరోజు రిలీజ్ చేసిన మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) లుక్ చూసి అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. గతంలో మోక్షజ్ఞ లుక్స్ వేరేగా ఉండేవి. కోవిడ్ టైంలో చూసుకుంటే మోక్షజ్ఞ భారీ కాయంతో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చాడు.
అతనికి ‘నటనపై ఆసక్తి లేదేమో’ అని భావించి అభిమానులు చాలా అప్సెట్ అయ్యారు. కానీ 2023 నుండి చూసుకుంటే మోక్షజ్ఞ లుక్స్ లో మార్పు వచ్చింది. ఇప్పుడు అతను బాగా స్లిమ్ అయ్యాడు. ఇప్పుడు కాస్త హైట్ గా కూడా కనిపిస్తున్నాడు. ఈ లుక్ కోసం అతను ఎలాంటి లైపోలు వంటివి చేయలేదట. ఓ ట్రైనర్ ను పెట్టుకుని తన తండ్రి మాదిరే ఉదయం 4 గంటలకే లేచి జిమ్ లో కసరత్తులు చేశాడట. డైట్ విషయంలో కూడా ట్రైనర్ చెప్పిన ఆహారమే తీసుకునేవాడట.
ఈ లుక్లోకి రావడానికి గాను అతనికి 186 రోజులు టైం పట్టినట్టు తెలుస్తుంది. అయితే మంచి రోజు చూసుకుని అతని లుక్ కి సంబంధించిన పోస్టర్స్ వదలాలని బాలయ్య టీం టైం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు రామకృష్ణా స్టూడియోస్ లో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ప్రశాంత్ వర్మ ఇంకా ఫైనల్ నెరేషన్ ఇవ్వనందున అనౌన్స్మెంట్ చేసి ఊరుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ లుక్స్ పట్ల హ్యాపీగా ఉన్నారు. అతని గత ఫొటోలతో పోల్చి మరీ.. లేటెస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
Transformation Of #NandamuriMokshagnya
The long-awaited debut of Telugu cinema, finally happening in his 30s#HBDMokshNandamuri pic.twitter.com/StsY433oSt
— Daily Culture (@DailyCultureYT) September 6, 2024