March 18, 202503:04:07 PM

Jayam Ravi Divorce: ‘జయం’ రవి విడాకులు.. కారణం ఆ సింగరేనా? రూమరా? నిజమా?

జంట మధ్య కాంట్రవర్శీలు జరిగాక విడాకులు జరుగుతుంటాయి. కానీ విడాకులు వచ్చాక కాంట్రవర్శీ జరుగుతోంది అంటే సమ్‌థింగ్‌ ఫిషీ అనిపించకమానదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిన జంట ప్రముఖ తమిళ హీరో ‘జయం’ రవి (Jayam Ravi)  – ఆర్తి. కొన్ని రోజుల క్రితం జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తనను సంప్రదించకుండానే విడాకులు అనౌన్స్‌ చేశారని ఆర్త చెప్పడం గమనార్హం.

Jayam Ravi

అయితే, ఈ విషయంలోకి ఇప్పుడు ప్రముఖ గాయని కెనీషా వచ్చారు. ఆమెతో జయం రవికి ఉన్న సంబంధమే ఇప్పడు విడాకులకు కారణమని కోడంబాక్కం టాక్. గత కొన్ని రోజులుగా జయం రవి తరచూ గోవా వెళ్తున్నాడని, అక్కడే ఓ బంగ్లాను కొనుగోలు చేశాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. అక్కడే గాయని కెనీషాతో ఉంటున్నాడని తాజాగా వస్తున్న పుకార్ల సారాంశం. అంతేకాదు ఈ విషయం ఆర్తికి తెలిసినా.. సన్నిహితులు నచ్చజెప్పడంతో ఆమె ఓర్పుగా ఉన్నారని అంటున్నారు.

సరిగ్గా ఈ సమయంలోనే జయం రవి విడాకులు ప్రకటించారు అని చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో జయం రవి ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి. విడాకుల విషయంలో తనను సంప్రదించలేదని ఆర్తి ఆరోపణల విషయంలోనే ఆయన ఇంతవరకు స్పందించలేదు. 2009లో ఆర్తిని జయం రవి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

జీవితం ఎన్నో అధ్యాయాల ప్రయాణం. సవాళ్లను ఎదుర్కోవాలి. నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నాను. ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. మా కుటుంబసభ్యుల ప్రైవసీని గౌరవించాలని అందరినీ కోరుతున్నాను అని జయం రవి సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు. ఆ తర్వాఈ ఈ విషయం తనకు తెలియదని ఆర్తి తెలిపారు. ఇప్పుడు ‘సింగర్‌’ ఆరోపణలు వస్తున్నాయి.

భార్య అలవాట్ల గురించి సిద్ధార్థ్ క్రేజీ కామెంట్స్.. కన్నీళ్లతో మేల్కొంటానంటూ?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.