March 25, 202512:09:34 PM

Kajal Aggarwal: సల్మాన్‌ సినిమాలో రష్మికతోపాటు మరో సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌.. ఎవరంటే?

కాజల్‌ (Kajal Aggarwal) ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఉంది. తెలుగులో ఇప్పటికే మొదలైన ఈ ఇన్నింగ్స్‌ బాలీవుడ్‌లో కూడా సాగిస్తోంది. ఇప్పటికే ఓ సినిమాను ఓకే చేసి విడుదలకు సిద్ధమవుతుంటే.. మరో సినిమాను కాజల్‌ ఓకే చేసింది అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెకండ్ ఇన్నింగ్స్‌లో కాజల్‌కు గోల్డెన్‌ ఛాన్స్‌ అని చెప్పాలి. ఎందుకంటే ఆమె ఓకే చేసిన సినిమా సల్మాన్‌ ఖాన్‌ది (Salman Khan) కాబట్టి. బాలీవుడ్‌ స్టార్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్ – తమిళ స్టార్‌ దర్శకుడు మురుగదాస్‌ (AR Murugadoss) కలసి ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

Kajal Aggarwal

ఈ సినిమాలో ఓ నాయికగా రష్మిక మందన (Rashmika Mandanna) నటిస్తోంది. ఇప్పటికే ఈ అనౌన్స్‌మెంట్‌ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు ఇందులో మరో హీరోయిన్‌కి చోటు ఉందని, అది కాజల్‌ అగర్వాల్‌ అని అంటున్నారు. సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో ఆమె వస్తుంది అని చెబుతున్నారు. సత్యరాజ్ (Sathyaraj) , ప్రతీక్‌ బబ్బర్‌ తదితరులను సినిమాలోకి ఇప్పటికే తీసుకున్న టీమ్‌.. మరికొంతమంది సౌత్‌ నటులను తీసుకుంటారు అని సమాచారం. అలాగే సౌత్‌లో మంచి ఫామ్‌, ఫ్లోలో ఉన్న ఇతర భాషల నటులను కూడా తీసుకుంటారు అని చెబుతున్నారు.

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను 2025 ఈద్‌ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే టీమ్‌ చెప్పేసింది. నిజానికి కాజల్‌ అగర్వాల్‌ తొలి సినిమా మనకు తెలిసినంతవరకు ‘లక్ష్మీ కల్యాణం’. అయితే ఆమె ‘క్యూ హో గయానా’ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది కాజల్‌. అక్కడికి మూడేళ్లకు ఆమె తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత చాలా ఏళ్లపాటు తెలుగు, తమిళ సినిమాలు చేసిన కాజల్‌..

2011లో ‘సింగమ్‌’ (Singham) సినిమాతో మళ్లీ అక్కడకు వెళ్లింది. ఆ తర్వాత తరచుగా అక్కడ సినిమాలు చేస్తూ వచ్చింది. అలా ‘స్పెషల్‌ 26’, ‘దో లఫ్జోం కీ కహానీ’, ‘ఫైనల్‌ కట్‌ ఆఫ్ డైరక్టర్‌’, ‘ముంబయి సాగా’ సినిమాల్లో నటిచింది. ఇప్పుడు ‘ఉమ’ అనే సినిమా చేస్తోంది. ఆ తర్వాతనే ‘సికందర్‌’ సినిమా ఉంటుంది.

ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.