March 21, 202501:20:39 AM

Malavika Mohanan: రొమాంటిక్ సీన్స్ అంత ఈజీ కాదన్న తంగలాన్ నటి.. అలా చెప్పడంతో?

తంగలాన్ (Thangalaan) సినిమాలో నటించి మాళవిక మోహనన్ (Malavika Mohanan) నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంటిమేట్ సీన్స్ లో నటించడం అంత ఈజీ కాదని మాళవిక కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మూవీ యుధ్రాలో ఇంటిమేట్ సీన్స్ లో నటించిన ఈ బ్యూటీ ఈ కామెంట్స్ చేశారు. రొమాంటిక్ సీన్స్ లో నటించడం అంత సులువు కాదని ఆమె తెలిపారు. ప్రతి సినిమాలో ఇంటిమేట్ సీన్స్ చేసే సమయంలో సెట్ లో ఇంటిమేట్ కో ఆర్డినేటర్ ఉంటారని ఆమె అన్నారు.

Malavika Mohanan

ఇంటిమేట్ కో ఆర్డినేటర్ నటీనటులు ఇబ్బంది పడకుండా ఎలా యాక్ట్ చేయాలో చెబుతుంటారని మాళవిక తెలిపారు. అలా చేయడం మంచి పని అని ఈ బ్యూటీ వెల్లడించారు. యుధ్రా మూవీలో అలాంటి సీన్స్ షూట్ చేసే సమయంలో కో ఆర్డినేటర్ సెట్ లో లేరని ఆమె తెలిపారు. సాథియా సాంగ్ షూట్ మాకు సవాలుగా మారిందని మాళవిక పేర్కొన్నారు.

సాంగ్ లో పలు రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని సముద్ర తీరంలో ఆ పాట చేయాలని ఆమె తెలిపారు. అక్కడ చలి ఎక్కువగా ఉండటంతో ఏం చేయాలో అర్థం కాలేదని మాళవిక మోహనన్ కామెంట్లు చేశారు. సిద్ధాంత్, నేను చాలా కంగారు పడ్డామని చలికి తట్టుకోలేక ఏదో ఒక విధంగా ఆ సీన్స్ పూర్తి చేయాలని అనుకున్నామని ఆమె అన్నారు.

దర్శకుడు ఎలా చెబితే అలా చేశామని ఇంటిమేట్ సీన్లు చేయడం చాలా కష్టమని నటీనటుల మధ్య మంచి అనుబంధం ఉండాలని మాళవిక మోహనన్ కామెంట్లు చేశారు. ఈ నెల 20వ తేదీన యుధ్రా మూవీ విడుదల కానుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. మాళవిక మోహనన్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రొమాంటిక్ సీన్స్ అంత ఈజీ కాదన్న తంగలాన్ నటి.. అలా చెప్పడంతో?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.